ఇండియాకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చైనా?

Chakravarthi Kalyan
నలుగురితో ఉండేటప్పుడు, నలుగురితో వెళ్లేటప్పుడు మనం ఒకళ్ళం సరిగ్గా ఉంటే సరిపోదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం ఎంత సరిగ్గా ఉన్నామో వాళ్లు కూడా అంతే సరిగ్గా ఉండాలి. అంతేగాని పక్కవాడు పరిస్థితి నాకెందుకులే నేను వెళ్తే సరిపోతుంది లే అన్న ధోరణిలో ఉంటే అది వాళ్లతో పాటు ఎదుటి వాళ్ళకి కూడా ప్రమాదమే.‌ ఎలా అంటే మంచి ట్రాఫిక్ లో మనం వెళ్తున్నప్పుడు మన వెనకాల వాళ్ళు, మన వెనక నుండి వచ్చేవాళ్ళు, మన ఎదురుగా వచ్చేవాళ్ళు ఇంకా మన పక్క నుండి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామో వాళ్లు కూడా అంతే జాగ్రత్తగా వెళ్లాలి.

లేదంటే మనం కరెక్ట్ గానే ఉన్నా పక్కవాడి తప్పిదానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారత్ చుట్టు పక్కల ఉండే దేశాల పద్ధతి వల్ల ఇప్పుడు భారత్ కి ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. మన పొరుగు దేశాలన్నీ అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితుల్లో చైనా అదుపు ఆజ్ఞల్లోకి వెళ్తున్నాయని తెలుస్తుంది. ఇది ఒక రకంగా మనకి, మన దేశ భద్రతకి పెను ముప్పు అని కొంతమంది రాజకీయ నిపుణులు అంటున్నారు. మనం ఎలాగూ అన్ని దేశాలనూ పోషించలేము. ఇప్పటికే మనం అన్ని దేశాలకు సహాయం చేస్తున్నాం అయితే మన దగ్గర ఉన్నంతలో మనం సహాయం చేస్తున్నాం ఒక వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్లు 10 వేలు ఇస్తున్నారు.

మన పొరుగున ఉండే శ్రీలంక, భూటాన్, నేపాల్ ఈ దేశాలన్నీ కూడా మన దగ్గర, ఇంకా చైనా దగ్గర సహాయాన్ని పొందుతూ ఉంటాయి. ఇక పాకిస్తాన్ అయితే 3వంతులు చైనా అదుపులో ఉంది. పైగా దానికి మనం శత్రువులు కాబట్టి మన సహాయాన్ని పాకిస్తాన్ తీసుకోదు. చైనా మిస్సైల్ సెంటర్ కి మయన్మార్ లో స్థలాన్ని ఇవ్వడం ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: