అమెరికాకి.. చుక్కలు చూపిస్తున్న చైనా?

Chakravarthi Kalyan
అమెరికా చైనా మధ్య గగనతలం విషయంలో ఇటీవల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అమెరికా విమానానికి దగ్గరగా దాదాపు 400 మీటర్ల వరకు వచ్చిన చైనా యుద్ద విమానం ఢీ కొనబోయి పక్కకు తప్పుకుంది. అమెరికా ఏవియేషన్ విభాగం హెచ్చరిస్తున్న యుద్ధ విమానం అటుగా రావడంతో అది ఢీకొంటే జరిగే ప్రమాదాన్ని చెప్పింది. కానీ చైనా తమకేమీ పట్టనట్లు అమెరికా విమానం వైపు దూసుకుపోయింది. దీంతో గగనతలంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చైనా మాత్రం మా సముద్ర జలాల్లో కానీ గగన తలంలో కానీ, భూభాగంపై కానీ ఎక్కడ ఎవరూ వచ్చినా సహించేది లేదని హెచ్చరికలు జారీ చేసింది.

చైనా, అమెరికాల మధ్య తైవాన్ విషయంలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. తైవాన్ చైనా అంతర్భాగమని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. కానీ తైవాన్ స్వతంత్ర దేశమని దానిపై దాడికి ప్రయత్నిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.  దీంతో అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.

రష్యా, ఉక్రెయిన్ యుద్దం విషయంలో కూడా ఉక్రెయిన్ కు అమెరికా సపోర్టు చేస్తుండటం, రష్యాకు చైనా రహస్యంగా ఆయుధాలు పంపడం లాంటి విషయాలతో ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇలా ప్రతి విషయంలో చైనా, అమెరికా మధ్య బల బలాల ప్రదర్శన కొనసా. చైనా బెలూన్లు కూడా అమెరికా జలాల్లోకి వెళ్లిన సమయంలో వాటిని అమెరికా పేల్చేసింది.

అయితే గతంలో కూడా గగన తలంలో ఇలాంటి పరిస్థితులు ఆస్ట్రేలియా, అమెరికా విమానాలకు ఎదురయ్యాయి. ఎయిర్ కమాండ్ కంట్రోల్ నుంచి వచ్చే ఆదేశాలను మధ్య లో చైనా వారి సముద్ర జలాల గగన తలంలోకి రాగానే చైనా హ్యక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు ఇలా ఇబ్బంది కలిగించినట్లు తెలిసింది. ఇప్పుడు యుద్ధ విమానం ఢీకొట్టేందుకు వెళ్లింది. ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: