కోస్తా : రోడ్డున పడిన క్రాస్ ఓటింగ్ ఎంఎల్ఏ

Vijaya
గురువారం సాయంత్రం  ఉదయగిరి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ బస్టాండ్ సెంటర్లో గోల గోలైంది. దీనికి కారణం ఏమిటంటే క్రాసో ఓటింగ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డే. క్రాస్ ఓటింగ్ తర్వాత పార్టీ నుండి సస్పెండ్ అయిన మేకపాటి అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే బాగా మండిపోతున్నారు. ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేస్తు ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడుతునే ఉన్నారు. దాంతో రెగ్యులర్ గా మేకపాటికి పార్టీ నేతలకు గొడవలవుతునే ఉన్నాయి.ఈ నేపధ్యంలోనే మేకపాటి నియోజకవర్గంలోకి అడుగుపెడితే అంతు చూస్తామంటు ఎవరో హెచ్చరించారట. దాంతో మండిపోయిన ఎంఎల్ఏ గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బస్టాండ్ దగ్గరకు వచ్చారు. రావటం రావటమే ఒక కుర్చీని వేయించుకుని రోడ్డుమీద కూర్చున్నారు. తాను బస్టాండ్ దగ్గరే రోడ్డుమీద కూర్చుని ఉన్నానని చెప్పారు. ఎవరొస్తారో వచ్చి తన అంతు చూడవచ్చంటు సవాలు చేశారు. దాంతో విషయం వైసీపీ నేతలకు చేరటంతో నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున బస్టాండ్ దగ్గరకు చేరుకున్నారు.దాంతో ఒకవైపు మేకపాటి+ఆయన మద్దతుదారులు, మరోవైపు వైసీపీ నేతలు మోహరించటంతో నానా గోలైపోయింది. విషయం తెలియగానే పోలీసులు కూడా పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. రెండువర్గాలు గొడవలు పడకుండా మధ్యలో పోలీసులు ఆపారు. అయినా ఎంఎల్ఏ, వైసీపీ నేతలు పట్టించుకోకుండా ఒకళ్ళకి మరోకళ్ళు సవాళ్ళు విసుకుంటునే ఉన్నారు.రెండువర్గాల మధ్య గొడవలతో ఆ ప్రాంతమంతా బాగా టెన్షన్ మొదలైపోయింది. మొత్తానికి రెండువర్గాలను పోలీసులు శాంతింపచేసి అక్కడినుండి పంపేశారు. ఎంఎల్ఏ ప్రతిరోజు జగన్ను ఉద్దేశించి నోటికొచ్చింది మాట్లాడటం వల్లే సమస్యలు వస్తున్నాయని పార్టీ నేతలంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి ఎంఎల్ఏ టికెట్ ను జగన్ భారీ ధరకు అమ్మేసుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎవరు ఓడించలేరని మరోసారి చాలెంజ్ చేశారు. దమ్ముంటే తనను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ఇంకోసారి చాలెంజ్ చేశారు. చాలెంజులు వరకు ఓకేనే కానీ జగన్ను తిట్టడంతోనే గొడవలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: