అమరావతి : దెబ్బకు దెబ్బంటే ఇలాగే ఉంటుందా ?

Vijaya



కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జగన్ అన్నదేమిటంటే చంద్రబాబును ఉద్దేశించి ‘ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ’ అని తాను పరుగులు పెట్టనని ఎద్దేవాచేశారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ గురించి చెబుతు దత్తపుత్రుడిలాగ ‘ఈ భార్య కాకపోతే మరో భార్య’ అని తాను అనను అని అన్నారు.





‘ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం..ఇక్కడే నా మమకారం..ఇక్కడి 5 కోట్ల ప్రజలే నా కుటుంబం..ఇక్కడే నా రాజకీయం..ఇక్కడి ప్రజల సంతోషమే నా ఇంటింటి విధానం’ అని జగన్ ప్రకటించారు. ఖమ్మంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణాలో మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జగన్ సెటైరికల్ గా స్పందించారు. చంద్రబాబును ఒక్కడ్నే అని జగన్ ఊరుకోరు కదా అందుకనే పవన్ పైన కూడా విరుచుకుపడ్డారు.





నిజానికి చంద్రబాబు, పవన్ ప్రస్తావన తేవాల్సిన అవసరమే జగన్ కు లేదు. అయినా ఎందుకు తెచ్చారు ? ఎందుకంటే చంద్రబాబు, పవన్ ఇద్దరు పదేపదే జగన్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే.  వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి పరిస్ధితులను చంద్రబాబు ప్రస్తావిస్తు జగన్ లక్ష కోట్ల రూపాయలు దోపిడీ చేశాడని, అవినీతి చేశాడని ఇప్పటికీ ఆరోపణలు గుప్పిస్తునే ఉన్నారు. దానికి బదులుగా జగన్ కూడా చంద్రబాబు, పవన్ ఇద్దరినీ కలిపి ఉతికేస్తున్నారు. ఇప్పటి రాజకీయమంతా దెబ్బకు దెబ్బ తీయటమే కదా.





సిద్ధాంతాల ప్లేసులో రాద్ధాంతాలు వచ్చేశాయి. దాంతో ప్రత్యర్ధులపై ఎవరెంత బురద చల్లేశారు అన్నదే ప్రధానమైపోయింది. ఇందులో ఎవరూ తక్కువ కాకపోయినా చంద్రబాబు అండ్ కో కి ఎల్లోమీడియా మద్దతుంది కాబట్టి పై చేయిగా ఉంది. ఇదే సమయంలో జగన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ తో పాటు ఎల్లోమీడియా మీదకూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. దెబ్బకు దెబ్బ అనే కాన్సెప్టు చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: