ఒక్క మిస్డ్ కాల్ తో బ్యాలెన్స్ ను చేసుకోవచ్చు..
అయితే పీఎఫ్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందన్న విషయాన్ని తెలుసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయన్న విషం తెలిసిందే. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం సమయంతో కూడుకున్న పని. అయితే ఒక చిన్న మిస్డ్ కాల్ లేదా ఎస్ఎమ్ఎస్ సహాయం తో మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవచ్చని మీకు తెలుసా.. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...
*. ఇందుకోసం ముందుగా మీ మొబైల్ నెంబర్ మీ యూనివర్సిల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసి ఉండాలి. అంతేకాకుండా UAN ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాకు కచ్చితంగా లింక్ అయి ఉండాలి.
ఇక మిస్డ్ కాల్ ద్వారా ఎలాగంటే..మీ UAN రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 01122901406 నెంబర్కు మిస్ కాల్ ఇవ్వాలి.అలా వెంటనే మీ ఫోన్కు మెసేజ్ రూపంలో మీ పీఎఫ్ బ్యాలెన్స్ వస్తుంది..