పీఎఫ్ ఖాతా గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

Satvika
ఉద్యోగం చేస్తున్న చాలా మందికి పీఎఫ్ అకౌంట్ అనేది తప్పనిసరి..ఇందులో పొదుపు చెస్తె భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది..ఇందులో జమ అయిన డబ్బు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పీఎఫ్‌ అకౌంట్లు డబ్బులు జమ కాకుంటే అకౌంట్‌ క్లోజ్‌అవుతుంది. ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతా అంటారు. వ్యక్తులు పదవీ విరమణ చేసినప్పుడ వారి పీఎఫ్‌ ఖాతాలో డబ్బు జమ చేయనప్పుడు ఇది తరచుగా జరుగుతుంటుంది. తర్వాత ఈ ఖాతాపై వడ్డీ కూడా ఆగిపోతుంది.

అటువంటి పరిస్థితిలో మీ పీఎఫ్‌ అకౌంట్‌ కూడా మూసివేయబడితే, దానిపై వడ్డీ ఎంతకాలం జోడించబడుతుందో, ఎన్ని సంవత్సరాల తర్వాత వడ్డీ ఆగిపోతుందో తెలుసుకోవడం అవసరం.పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పీఎఫ్ ఖాతాలో పీఎఫ్ సొమ్ము జమ చేసినా, వేయకపోయినా వడ్డీ జమ అవుతూనే ఉంటుందనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మీరు పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లలోపు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజీనామా చేసిన 36 నెలలలోపు మీ పీఎఫ్‌ ఖాతా నుండి మీ డబ్బును ఉపసంహరించు కోకపోతే మీ ఈపీఎఫ్‌ ఖాతా నిష్క్రియం అవుతుంది. ఖాతా మూసివేయబడిన తర్వాత, దానిపై వడ్డీ కూడా ఆగిపోతుంది..

58 ఏళ్లలోపు ఉద్యోగానికి రాజీనామా చేసినా, పదవీ విరమణ తీసుకున్న తర్వాత రాబోయే మూడేళ్ల వరకు డబ్బు పీఎఫ్‌ ఖాతాలో జమ చేయబడదు. అప్పుడు ఖాతా మూసివేయబడుతుంది. వడ్డీ కూడా రాదు.. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినా, పదవీ విరమణ చేసినా లేదా ఉద్యోగాన్ని పూర్తి చేసినా, ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన వడ్డీపై పన్ను విధించడం ప్రారంభమవుతుంది. మీ ఈపీఎఫ్‌ ఖాతా నిష్క్రియంగా లేదా మూసివేయబడితే, దానిలో జమ చేసిన మొత్తంపై పన్ను విధించబడుతుంది.ఈపీఎఫ్‌ సభ్యత్వం పొందిన మొదటి 5 సంవత్సరాలలో ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పని చేస్తే, ఉద్యోగం రెగ్యులర్‌గా పరిగణించబడుతుంది. ఉద్యోగి మునుపటి కంపెనీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ప్రస్తుత సంస్థకు బదిలీ చేస్తే, ఆ ఉద్యోగి పన్ను ప్రయోజనాల కోసం 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతర సేవలో ఉంచినట్లు పరిగణించబడుతుంది...అప్పుడు పన్ను విధించబడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: