పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి క్రియేట్ చేసిన అద్భుతమైన సినిమా RRR. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.ఇక రీసెంట్ గా rrr సినిమాను జపాన్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ఇక రాజమౌళి తో పాటు హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ ప్రమోషన్ చేసిన విధానం బాగా వైరల్ అయింది. ఇక జపాన్ దేశంలో rrr సినిమా ఎంతో అద్భుతమైన కలెక్షన్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రతి వారం కూడా ఈ సినిమా మంచి ఫుట్ఫాల్లను రికార్డ్ చేస్తోంది. జపాన్ లో rrr సినిమా ఇప్పటి వరకు ¥185M వసూలు చేసింది.బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ 3 ఇడియట్స్ కలెక్షన్స్ ను అధిగమించి జపాన్ లో అత్యధిక వసూళ్లను అందుకున్న మూడవ భారతీయ సినిమాగా rrr నిలిచింది.
ఇక ఈ సినిమా మరో రెండు వారాల్లో బాహుబలి 2ని బీట్ చేసే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత రజినీకాంత్ ముత్తు పేరిట ఉన్న లాంగ్ స్టాండింగ్ రికార్డ్ను బద్దలుకొడుతుందని అంతా కూడా భావిస్తున్నారు. కానీ కలెక్షన్స్ రేంజ్ ఇంకాస్త పెరిగితే గాని సూపర్ స్టార్ జపాన్ రికార్డును బ్రేక్ చేయలేరు.ఇక్కడ చెప్పుకోదగిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత 30 సంవత్సరాల నుంచి జపాన్ దేశంలో టిక్కెట్ ధరలు పెరగలేదు. కాబట్టి rrr సినిమా టిక్కెట్ ధరలు 27 సంవత్సరాల క్రితం విడుదలైన ముత్తు లాగానే ఉన్నాయి. ముత్తు సినిమా ¥400M వసూళ్ళను అందుకొని అప్పటికీ ఇప్పటికీ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. మరి ఆర్.ఆర్.ఆర్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.