నిజమైన జాతిరత్నం.. పరీక్షల్లో పెళ్లి గురించి రాయమంటే?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా కాస్త ఎక్కువగానే అప్డేట్ అయిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కాస్త కొత్తగానే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక ఇలా ఎవరైనా వినూత్నంగా ఏదైనా కొత్తగా ట్రై చేసారు అంటే చాలు.. అది సోషల్ మీడియాలో ఆటోమేటిక్ గా వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటిదే ట్విటర్ వేదికగా ఒకటి చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.  సాధారణంగా ఎంతో మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ సమయంలో వింతైన ఆన్సర్లు రాస్తూ ఉంటారు. ఏదైనా ప్రశ్నకి ఆన్సర్ తెలియకపోతే ఏకంగా సినిమా స్టోరీలు రాయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

 ఇలా స్టూడెంట్స్ ఎవరైనా చేశారు అంటే చాలు ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళు కదా నిజమైన జాతి రత్నాలు అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒక టీచర్ కి ఇలాంటి ఘటన ఎదురయింది అని చెప్పాలి. స్టూడెంట్ ఒక ప్రశ్నకి ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు టీచర్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే పెళ్లి గురించి చెప్పమని క్వశ్చన్ ఇచ్చారు విద్యార్థికి.

 ఈ క్రమంలోనే సదరు విద్యార్థి కాస్త కొత్తగా ఆలోచించాడు. తనలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటపెట్టేసాడు. ఇక ఇది చూసిన టీచర్ కు మైండ్ బ్లాక్ అయింది అని చెప్పాలి. దీంతో ఆ విద్యార్థి రాసిన ఆన్సర్ను కొట్టివేయడమే కాదు నాన్సెన్స్ అంటూ రాసింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ఎంతోమంది నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. ఇంకొంతమంది నిజం చెప్పావురా బుడత అసలైన జాతిరత్నం అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇక ఆ బుడతడు రాసిన ఫన్నీ ఆన్సర్ మీరు కూడా చదివేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: