జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ గెలిచాక పేర్ని నాని కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. రవాణా పౌరసంబంధాల శాఖ మంత్రిగా జగన్ మొదటి మంత్రివర్గ విస్తరణలో పేర్ని నాని బెర్త్ కొట్టేశారు.తాజాగా పేర్ని నాని జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ కాదని.. చంద్రబాబు అనుకూల సంస్థ అని ఆరోపించారు. చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే సంస్థే జనసేన అని పేర్ని నాని కామెంట్స్ చేశారు.అమరావతి నుంచి అరసవల్లి వరకు సాగుతున్న రాజధాని ప్రాంత రైతుల మహాపాదయాత్రకు ఒక్క వైఎస్సార్సీపీ తప్ప ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు అతీతంగా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా బలమైన నాయకుడని అందుకే ఆయనను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని మండిపడ్డారు.కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగా గతంలో మాట్లాడారని పేర్ని నాని గుర్తు చేశారు. అమరావతి ప్రజా రాజధాని కాదని వామపక్షాలు కూడా విమర్శించాయన్నారు.
ఇప్పుడు వీరంతా ముఠాగా ఏర్పడి దుష్టచతుష్టయం సాయంతో అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అందువల్ల ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. వీరంతా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని పేర్ని నాని విమర్శలు చేశారు.మరోవైపు పేర్ని నానిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు అమరావతి మాత్రమే రాజధాని అని ఇప్పటికే జగన్ మాడు పగలకొట్టే తీర్పు ఇచ్చిందని.. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా మాడు పగలడం ఖాయమని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతికి అనుకూలమన్నారని.. ఇప్పుడు ప్లేటు మార్చారని మండిపడుతున్నారు. మాట తప్పడు-మడమ తిప్పడు అని జగన్ గురించి వైఎస్సార్సీపీ నేతలు గొప్పగా చెబుతారని.. మరి ఇప్పుడు జగన్ చేస్తుందేమిటో చెప్పాలని టీడీపీ నేతలు బాగా నిప్పులు చెరుగుతున్నారు.