అమరావతి : వీళ్ళకు టికెట్లు గ్యారెంటీలేదా ?
ఒక్కదెబ్బకు వైసీపీ ఎంఎల్ఏల్లో చాలామంది నియోజకవర్గాల్లో పరుగులు పెడుతున్నారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావటానికి ఈ కార్యక్రమంలో చేయించుకునే సర్వే కూడా కీలకమని జగన్ చాలాసార్లే చెప్పారు. రెగ్యులర్ గా జనాల్లోను, క్యాడర్ తోను టచ్ లో ఉండే ఎంఎల్ఏలకే టికెట్లిస్తానని జగన్ స్పష్టంగా చెప్పారు. అయితే చాలామంది ఎంఎల్ఏల్లో జగన్ హెచ్చరికలు పనిచేయలేదు.
దాంతో ఈమధ్య కొందరు ఎంఎల్ఏలను పిలిపించుకుని ఫుల్లుగా క్లాసు పీకారు. దాంతో చాలామంది ఎంఎల్ఏలు దారికొచ్చేశారట. పనితీరు ఎలాగుందనే విషయంలో చాలామంది ఎంఎల్ఏలకు వారి సర్వే రిపోర్టును జగన్ తీసి చూపించారట. ఏదోలే ఇలాగే మాట్లాడుతుంటారని అనుకున్న చాలామంది ఎంఎల్ఏలు జగన్ దెబ్బకు దిగొచ్చేశారని సమాచారం. మొత్తంమీద 50 మంది ఎంఎల్ఏల పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదట. కానీ జగన్ క్లాసు పీకిన తర్వాత చాలామంది దారిలోకి వచ్చేశారట.
పనితీరు బావోలేని ఎంఎల్ఏల సంఖ్య సుమారుగా 50 ఉంటే ఫుల్లు క్లాసు తర్వాత సుమారు 30 మంది దారిలోకి వచ్చారట. వీళ్ళంతా రెగ్యులర్ గా గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నివేదికలు అందాయట. ప్రజల దగ్గరకు వెళ్ళటమే కాకుండా పార్టీ క్యాడర్ తో కూడా సమావేశాలు పెట్టుకుంటున్నారట. అంటే అంతలావు క్లాసు పీకితే కానీ చాలామంది ఎంఎల్ఏలు దారికి రాలేదని అర్ధమవుతోంది.
మరి ఇంకా దారికిరాని ఎంఎల్ఏల సంగతి ఏమిటి ? ఏమీలేదు వీళ్ళకు టికెట్లు దక్కవంతే. ఎందుకంటే బెదిరింపులు, బతిమాలాడుకోవటాలు, ఒత్తిళ్ళు తెచ్చి పనిసాధించుకోవటం జగన్ దగ్గర చెల్లవని ఇప్పటికే అర్ధమైపోయింది. కాబట్టి పార్టీవర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో సుమారు 35 మంది ఎంఎల్ఏలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. వీళ్ళ పనితీరు బావోలేకపోవటంతో పాటు పార్టీ అదేశాలను థిక్కరిస్తుండటం కూడా ప్రధాన కారణమవుతోంది. పనితీరూ మార్చుకోకుండా, అధినేత ఆదేశాలను లెక్కచేయకపోతే ఇక వారికి జగన్ టికెట్లు ఎలాగ ఇస్తారని పార్టీలోనే చర్చ జరుగుతోంది.