రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా కింద 35 లక్షల విరాళం..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాము ఇంట్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోమని తెలిపారు. తాను ఏం చేస్తున్నా ఉన్నత శిఖరాలు అందుకోవాలని వారు కోరుకుంటారని పేర్కొన్నారు. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చూసి, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల దయనీయ స్థితి గురించి తెలుసుకొని చలించిపోయారు. వీరంతా కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండాలని వారు ముందుకు వచ్చారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు నిహారిక రూ.5 లక్షలు అందించారు. వారితోపాటు.. నాగబాబు-పద్మజ, పవన్ సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులు కూడా విరాళాలు అందించారు.
ఈ మేరకు పవన్ పవన్ కుటుంబం మొత్తం రూ.35 లక్షలు అందించినట్లు నాదేండ్ల మనోహర్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ.. నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎంతోమంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఇంటి యజమానులను కోల్పోయి వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయంటూ మనోహర్ వివరించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కౌలు రైతుల భరోసా కార్యక్రమం ప్రారంభించి, మరణించిన కౌలు రైతుల పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు..ఇలాంటి కార్యక్రమం పై మెగా ఫ్యామిలి ముందుకు రావడం గ్రేట్ అని హర్షం వ్యక్తం చేశారు..