రైతులకు గుడ్ న్యూస్ : వారి అకౌంట్లో ఆ డబ్బులు!

Purushottham Vinay
ఇక దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటని చెప్పాలి.అలాగే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Scheme) స్కీమ్ 11వ విడతకు సంబంధించిన రూ. 1.80 లక్షల కోట్లను మే 31వ తేదీన రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేయనున్నారు. ఇక ఈ మేరకు కేంద్ర బీజేపీ చీఫ్‌ నడ్డా ప్రకటించారు.మంగళవారం నాడు 10కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతి భూమి ఉన్న రైతు కుటుంబానికి కూడా సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. ఇంకా రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి దాకా 10వ విడత జమ కాగా, ఇక ఇప్పుడు 11వ విడత నిధులు రేపు జమ కానున్నాయి. అయితే ఈ డబ్బులు వచ్చిన తర్వాత జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. పదో విడత జనవరి 1 వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా, ఇప్పుడు 11వ విడతను కూడా అందించనుంది.


ఇక ఎవరు ప్రయోజనం పొందుతారు అంటే..ఈ పథకం ప్రయోజనం సాగు కోసం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఇతర రకాల ప్రభుత్వ పెన్షన్‌ల ప్రయోజనం కూడా పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు ఇంకా అలాగే ఎమ్మెల్యేలు తదితరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అలాగే ఇక దీనితో పాటు, కుటుంబంలో భార్య లేదా భర్త మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇద్దరికి కూడా డబ్బులు వస్తున్నట్లయితే అనర్హులు.ఇక డబ్బులు వచ్చాయా? లేదా అనేది మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు వెబ్‌సైట్‌కి వెళ్లాలి.తరువాత ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయండి.ఇంకా అలాగే ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.ఇక మీ స్టేటస్ ని చెక్ చేయడానికి మీరు ఆధార్ నంబర్ ఇంకా అలాగే మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.ఇక ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరు ఉందో లేదో  మీరు ఈజీగా తెలుసుకోచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: