మూడ్ ఆఫ్ ఏపీ : జగన్ లో గెలుపు ధీమాకు కారణాలివే.. ఆ సర్వేతో క్లారిటీ వచ్చేసిందా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు చేసిన సంచలన ప్రకటనతో కూటమి నేతల మైండ్ బ్లాంక్ చేశారు. ఎన్నికలు పూర్తైనప్పటి నుంచి తమదే అధికారం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న కూటమి నేతల నోర్లను ఒకే ఒక్క ప్రకటనతో జగన్ మూయించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత జగన్ ఐప్యాక్ తో సర్వే చేయించుకున్నారని ఆ సర్వే అనంతరం ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.
 
సర్వేలో మరోసారి తననే సీఎం చేయబోతున్నారని తెలిసి జగన్ ఆనందం వ్యక్తం చేసినట్టు సమాచారం. కచ్చితమైన సమాచారం ఇచ్చే వ్యక్తులతో మాత్రమే ఈ సర్వే చేయించారని అందువల్ల ఈ సర్వే ఫలితాలే జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలుగా ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ లో గెలుపు ధీమాకు కారణం ఈ సర్వేనే అని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయే ఛాన్స్ లేదని లెక్కలతో సహా తేలిపోయిందని తెలుస్తోంది.
 
ఏపీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడం కోసం జగన్ రేయింబవళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు. పక్కా ప్రణాళికతో రాళ్ల దాడులు చేయించినా వాటిని ఓర్చుకుని జగన్ ముందడుగులు వేశారు. తనపై ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలకు ఒకే ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఆయా నేతల గూబ గుయ్యిమనేలా జగన్ సమాధానాలు ఇచ్చారు. చివరకు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం మరోసారి అధికారం రూపంలో దక్కబోతుందని జగన్ ఫిక్స్ అయ్యారు.
 
రాష్ట్రంలోని మహిళలు, వృద్ధులు, పథకాల ప్రయోజనాలు పొందిన పురుషులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, తను అమలు చేసిన పథకాల ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబాలు తనకు అండగా నిలిచాయని జగన్ నమ్ముతున్నారని తెలుస్తోంది. ఖచ్చితమైన సమాచారంతో మరోసారి వైసీపీదే గెలుపని తేల్చి చెప్పిన జగన్ జూన్ 4వ తేదీన మరోమారు అద్భుతమైన ఫలితాలతో నమ్మకాన్ని నిజం చేసుకుని ప్రజల ముందుకు వస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: