చీరాల కాంగ్రెస్ కాండిడేట్ ఆ రెండు ప్రధాన పార్టీల ఓటు బ్యాంక్ కి గట్టి దెబ్బ కొట్టనున్నాడా..?

Pulgam Srinivas
ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలలో పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వైసీపీ, కూటమి బలాన్ని తట్టుకొని నిలబడడంలో ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యింది. ఒకటి , రెండు స్థానాలు తప్పిస్తే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడా కూడా వైసీపీ, కూటమి అభ్యర్థులకు పెద్దగా భయాన్ని కలిగించలేదు. ఇకపోతే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ మాత్రం ప్రస్తుతం వైసీపీ , టీడీపీ నేతలకు వణుకు పుట్టిస్తున్నాడు.

అసలు ఏంటా స్టోరీ తెలుసుకుందాం. ఆమంచి కృష్ణమోహన్ 2009 వ సంవత్సరం మొదటి సారి చీరాల నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆ తర్వాత ఈయన 2014 వ సంవత్సరం స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుండి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2014 వ సంవత్సరం ఎమ్మెల్యే అయిన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలో కొంత కాలం పాటు ఉన్న ఈయన 2019 వ సంవత్సరం వైసీపీ పార్టీలోకి చేరారు.  

వైసిపి పార్టీలో 2019 వ సంవత్సరం నుండి ఉన్న ఈయన తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుండి సీటును ఆశించారు. కానీ వైసీపీ పార్టీ ఈయనకు ఈ ప్రాంత సీట్ ను ఇవ్వడానికి నిరాకరించడంతో ఈయన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి చీరాల ఎమ్మెల్యే సీటును తెచ్చుకున్నారు. ఇక వైసీపీ పార్టీ చీరాల అసెంబ్లీ సీటును టీడీపీ నుండి వచ్చిన కరణం వెంకటేష్ కు ఇచ్చింది. ఇక కూటమి చీరాల అభ్యర్థిగా మద్దులూరి మాలకొండయ్య యాదవ్ కి అవకాశాన్ని కల్పించింది.

ఇక మొదట ఇటు కరణం వెంకటేష్ వర్గం అటు మాలకొండయ్య వర్గం ఇద్దరు కూడా డి అంటే డి అంటూ ప్రచారాలను చేస్తున్న సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి సీటు తెచ్చుకొని ఆమంచి వీరిద్దరికి షాక్ ఇచ్చాడు.

ఆమంచి కి చీరాలలో మంచి పట్టు ఉండడం , అలాగే ఈయన కాపు సామాజిక వర్గం నేత కావడంతో ఆ వర్గము యొక్క ఓట్లను మరియు మత్స్య , దేవాంగ , ఎస్సీ , పద్మశాలి ఓట్లు ఇతనికి బాగా పడే అవకాశం ఉండడంతో ఈయన వైసీపీ క్యాండిడేట్ కరణం కి టీడీపీ క్యాండిడేట్ మాలకొండయ్య లో ఎవరికి దెబ్బ కొడతాడా లేక ఇద్దరికి దెబ్బ కొట్టి ఆయన గెలుస్తాడా అనేది చీరాల నియోజకవర్గం లో సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: