మూడ్ ఆఫ్ ఏపీ : ఒక్క డైలాగ్‌తో కూటమి నేతలకు నిద్ర లేకుండా చేసిన జగన్ ?
జగన్ చేసిన ఈ కామెంట్లు వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి. జగన్ చేసిన కామెంట్లతో ఏపీలో బెట్టింగ్ ట్రెండ్ కూడా క్రమంగా మారుతోందని తెలుస్తోంది. జగన్ ఇప్పటికే ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి వేర్వేరు సంస్థలతో సర్వేలు చేయించుకోవడం జరిగింది. ఆ సర్వేల ఫలితాలకు సంబంధించి జగన్ కు అవగాహన ఉంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు.
జగన్ చేసిన కామెంట్ల ప్రకారం రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే మాత్రం కూటమి భవిష్యత్తులో సైతం రాయలసీమ జిల్లాలలో కోలుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని భావిస్తున్న చంద్రబాబు, లోకేశ్, పవన్, బాలయ్యలకు జగన్ కామెంట్లు బలంగా బాణంలా గుచ్చుంటాయని చెప్పవచ్చు.
వాస్తవానికి 2019లో కుటుంబ సభ్యుల నుంచి జగన్ కు పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించింది. ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోయినా ఫలితాలు వార్ వన్ సైడ్ అయితే మాత్రం జగన్ అంటే ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో ఇతర రాష్ట్రాల ప్రజలకు, నేతలకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. జగన్ లెక్క తప్పదని ఆయన సన్నిహితులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.