ప్రేమ అనే పేరుతో యువతిని మోసం చేసినందుకు తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని వెళ్లిన తల్లికి అబ్బాయి కుటుంబం పెద్ద షాక్ ని ఇచ్చింది.ఇక అంతేకాకుండా వారికి కుల పెద్దలు కూడా సహకరిస్తూ మా బిడ్డకు అన్యాయం చేస్తున్నారంటూ కుటుంబికులు ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో బాధితులు గురువారం నాడు పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం కథనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెం పంచాయతీలో రెక్కడితేనే కానీ డొక్కనిండని కూలి పనులు చేసుకునే కుటుంబానికి చెందిన ఆ యువతి.. బాగా తెలిసిన వాళ్ళతో దూరపు కూలిపనులకు వెళ్లిందని వారు తెలిపారు.వరుసకు మేనమామ కొడుకు అయిన ఆ వ్యక్తి ఇంకా అతని అక్క.. ఇద్దరు కూడా కలిసి మాయమాటలతో తమ బిడ్డను మోసం చేశారని వారు అన్నారు. ఇదంతా కూడా అతని అక్క దగ్గరుండి మరీ నడిపించిందని బాధిత కుటుంబం తెలిపింది. అయిన వాళ్లే కదా మోసం చెయ్యారులే అనుకొని నమ్మిన ఆ యువతికి నేను మోసపోయాను అని తెలుసుకోవటానికి ఎక్కువ సమయం అనేది పట్టలేదని, తమ్ముడుతో అసభ్యకరంగా ప్రవర్తించేందుకు సహకరిస్తూ అతని అక్క కూడా ఎంతో మానసిక తృప్తిని పొందిందని ఆవేదన చెందారు.
ఇక ఇదిలా ఉంటే కూలి పనుల నుండి ఇంటికి వచ్చిన ఆ యువతి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండటంతో భయపడిన ఆమె కన్నతల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు మీ అమ్మాయి గర్భం దాల్చిందని చెప్పడంతో దెబ్బకు నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని ఆ యువతిని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇక ఆ అమ్మాయికి న్యాయం చేయాలంటూ యువకుడి ఇంటికి వెళ్లగా కుల పంచాయతీ పెట్టి జరిగిన తప్పుకు రూ.30 వేలు దండగ కడుతూ గర్భం తీసేసుకోవాలని కుల పెద్దలు తీర్పు చెప్పారని ఆ బాధిత తరుపు కుటుంబం తెలిపింది.ఇక అంతేకాకుండా యువకుడికి కుల పెద్దల సమక్షంలో మరో యువతితో పెళ్లి చేసేందుకు రెడీగా ఉన్నారని వారు వివరించారు. దీంతో చేసేదేమి లేక లక్ష్మీదేవి పల్లి మండల పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోసం బాధిత కుటుంబం వారు ఫిర్యాదు చేశారు.