అమర్‌నాథ్‌యాత్ర పై ఉగ్రకుట్ర.. బయటపెట్టి బీఎస్‌ఎఫ్‌?

Chakravarthi Kalyan
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్రపై దాడి చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారా.. మంచు కొండల్లో నెత్తుటేరులు పారించాలనుకున్నారా.. ప్రశాంతంగా ఉన్న కాశ్మీరంలో రుధరం చిందిచాలనుకున్నారా.. అంటే.. అవునని చెప్పాలి.. అలాంటి ఓ కుట్రను మన బీఎస్‌ఎఫ్‌ బట్టబయలు చేసింది. జమ్ముూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారీ రహస్య సొరంగాన్ని మన సైన్యం గుర్తించింది. త్వరలో జరగనున్న అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ ఉగ్రవాదులు కుట్రకు తెరలేపారని మన భద్రతా బలగాలు తెలిపాయి.

జమ్ముూ కాశ్మీర్‌లోని పాకిస్థాన్‌ ఔట్‌పోస్టుకు సమీపంలో ఉన్న ఈ సొరంగం గుర్తించారు. దీని ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ఏర్పాటు చేశారని సైన్యం భావిస్తోంది. సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ  భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం కనిపెట్టింది. చాక్‌ ఫఖీరా బోర్డర్‌ ఔట్‌పోస్టుకు సమీపంలో 150 మీటర్ల సొరంగం ఉంది. ఈఏడాది జూన్‌ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ యాత్ర లక్ష్యంగా ఈ  సొరంగం తవ్వారని భావిస్తున్నారు.

పాక్‌ భూభాగం నుంచే ఈ సొరంగం ఉందని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. పాక్‌ అవుట్‌ పోస్ట్‌కు కేవలం 3వందల మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉండటం విశేషం. ఈ సొరంగం నుంచి భారత్‌లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లు మాత్రమే. అమర్‌నాథ్‌ యాత్రపై దాడి చేసేందుకే ఉగ్రవాదులు ఈ సొరంగం నుంచి చొరబాటుకు ప్లాన్‌ చేసుకుని ఉంటారని సైన్యం భావిస్తోంది.

అమర్‌నాథ్ యాత్రపై దాడులు చేయడం పాక్ ఉగ్రవాదులకు కొత్త కాదు.. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు చనిపోయారు. ఇటీవల కూడా జమ్మూ కాశ్మీర్‌లో దాడులు జరిగాయి. సుంజ్వాన్‌ ప్రాంతంలో ఏప్రిల్ 22న సీఐఎస్‌ఎఫ్‌ బస్సుపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. మొత్తానికి ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: