విశాఖ కుర్రాళ్లకు జగన్ అందిస్తున్న గుడ్‌న్యూస్?
విశాఖ పట్నంలో ఈ శని, ఆదివారాలు అంటే.. 23, 24 తేదీల్లో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ జాబ్ మేళా కోసం 206 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయట. ఈ జాబ్ మేళాను అవసరం అయితే, సోమవారం కూడా నిర్వహిస్తామని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఇక్కడ ఇప్పటికే 77 వేల మంది ఉద్యోగార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారట. మొత్తం ఈ జాబ్ మేళా ద్వారా 23,935 ఖాళీలు ఇక్కడ భర్తీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ జాబ్ మేళా సక్సస్ అయితే.. కుటుంబంలో నలుగురిని లెక్క వేసుకున్నా, దాదాపు లక్ష మంది ముఖాల్లో చిరునవ్వులు ఖాయం అంటున్నారు విజయసాయిరెడ్డి.
ఈ జాబ్ మేళాలో 206 కంపెనీలకు 206 రూమ్‌లు కేటాయించారు. ఇక ప్రతి రూమ్ వద్ద ఆ కంపెనీకి సంబంధించి వివరాలు ప్రదర్శిస్తారట. ఏ ఉద్యోగాలు ఉన్నాయి.. ఏయే అర్హతలు కావాలి.. అనే విషయాలు ఆ రూమ్ దగ్గర ప్రదర్శిస్తారు. అలాగే ప్రతి బ్లాక్‌లో వేర్వేరుగా ఫార్మా, ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్‌టైల్స్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్ తదితర విభాగాలకు రూమ్‌లు కేటాయించారు. ఈ జాబ్ మేళా కోసం 13 భవనాల్లో 206 గదులు సిద్దం చేశారు.
ఇక ఈ జాబ్ మేళాకు వచ్చిన 206 కంపెనీలకు ఒకొక్కరికి 4గురు వలంటీర్లను కేటాయించారు. అలాగే ప్రతి భవనానికి 5గురు టీచర్లను నియమించారు. అంటే మొత్తం 860 మంది వలంటీర్లు ఈ జాబ్ మేళాలో సేవలు అందిస్తున్నారు. అవసరమైన పక్షంలో సోమవారం కూడా జాబ్ మేళా నిర్వహించి 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామంటున్నారు విజయసాయిరెడ్డి.