అమరావతి : పవన్ చేస్తున్న తప్పేంటో తెలుసా ?

Vijaya



పార్టైమర్ ఎప్పటికీ పార్టైమరే కానీ ఫుల్ టైమర్ కాలేడు. ఇంతచిన్న విషయాన్ని అర్ధం చేసుకోలేకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చతికిలపడుతున్నారు. 24 గంటలూ 365 రోజులూ రాజకీయాల్లోనే ఉంటు రాజకీయాలే ఊపిరిగా ఉంటున్న వాళ్ళల్లోనే చాలామందికి ఎదుగుబొదుగు లేకుండా ఉంది. అలాంటిది ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరుస్తానని, సినిమా షూటింగుల్లో గ్యాప్ వచ్చినపుడు రాజకీయాల్లో కనబడతానని పవన్ అనుకుంటే ఎలా సాధ్యం ?



ఇక్కడే పవన్ రాజకీయం ఫెయిలవుతోంది. జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా చంద్రబాబునాయుడును తీసుకున్నా లేకపోతే మరికొందరినీ తీసుకున్నా వాళ్ళంతా రాజకీయాలే ఊపిరిగా ముణిగి తేలుతున్నారు. అలాంటిది పవన్ మాత్రం అవకాశముంటే సినిమాల్లో గ్యాపొస్తే రాజకీయాల్లో తిరుగుతానంటే ఎలా కుదురుతుంది ? జనాలు ఫుల్ టైం పొలిటీషియన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తారుకానీ పార్టైమర్ ను కాదన్న చిన్న విషయాన్ని పవన్ అర్ధం చేసుకోలేకపోతున్నారు.




ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీని స్ధాపించినపుడు కూడా ఈ విషయంపై క్లారిటి ఉందికాబట్టే చిరంజీవి కూడా సినిమాలను పూర్తిగా వదిలేశారు. 24 గంటలూ పూర్తిస్ధాయి రాజకీయాల్లో తిరిగితే కూడా జనాలు చిరంజీవిని ఆదరించలేదు. తన సోదరుడికి ఏమి జరిగిందో ప్రత్యక్షంగా చూసి కూడా రాజకీయాలను పవన్ చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జనాలు పవన్ పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓడగొట్టింది.



టీడీపీలో నందమూరి బాలకృష్ణ కూడా పార్ట్ టైమ్ పొలిటీషీయనే. కానీ బాలయ్యా బావయ్య ఫుల్ టైం పొలిటీషియన్ కాబట్టే బాలయ్య ఎంఎల్ఏగా మాత్రం గెలవగలుగుతున్నారు. పైగా హిందుపురంలో బాలయ్య గెలుపుకు ప్రధాన కారణం స్ధలమహత్యం. తండ్రి ఎన్టీయార్, సోదరుడు హరికృష్ణ కూడా ఇక్కడి నుండి గెలిచారు కాబట్టే బాలయ్య రెండుసార్లు గెలిచారంతే. ఏదేమైనా సినిమాలా ? రాజకీయాలా ? అని తేల్చుకోవాల్సిన అవసరం పవన్ కు ఇచ్చింది. అలా కాకుండా రెండుపడవల ప్రయాణం చేస్తానంటే తప్పు చేస్తున్నది పవనే,  ముణిగిపోయేది పవనే అందులో సందేహమే అవసరంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: