ఉక్రెయిన్‌కు ఆ దేశం సాయంచేస్తే.. రష్యాకు చుక్కలే?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు సాధ్యమైనంతగా పోరాడుతున్నాడు. తమకు మద్దతు ఇవ్వాలని అనేక దేశాలను ఆయన కోరుతున్నాడు. తాజాగా రష్యాపై చేస్తున్న వీరోచిత పోరాటంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని ఆ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దక్షిణ కొరియాను కోరారు. యుద్ధంలో తమకు అవసరమైన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆయుధాలను అందించాలని ఆయన దక్షిణ కొరియాను కోరారు. దక్షిణ కొరియా చట్టసభలను ఉద్ధేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించారు.

ఈ సమయంలో జెలెన్‌స్కీ ఈ మేరకు అభ్యర్థించారు. గతవారం కూడా ఉక్రెయిన్ అధికారులు  దక్షిణ కొరియాను సాయం కోరారు. అయితే.. ఆయుధ సాయాన్ని దక్షిణ కొరియా రక్షణమంత్రిత్వశాఖ తిరస్కరించింది. అందుకే ఈసారి జెలెన్‌స్కీ స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు. రష్యా క్షిపణులను దక్షిణ కొరియా యుద్ధ ట్యాంకులు, నౌకలు అడ్డుకోగలవని జెలెన్‌స్కీ అంటున్నారు. యుద్ధంలో తమకు సాయం చేస్తే  ఎప్పటికీ రుణపడి ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

అయితే ఇప్పటి వరకూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీకి దక్షిణ కొరియా నుంచి భరోసా మాత్రం రాలేదు. కానీ.. ఒకవేళ దక్షిణ కొరియా కనుక ఈ యుద్ధంలో అడుగు పెట్టినా.. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేసినా సీన్ మరోలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. దక్షిణ కొరియా  వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. పైగా ఉత్తర కొరియాతో వైరం కారణంగా దక్షిణ కొరియా ఎప్పుడూ అత్యాధునిక ఆయుధాలతో యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.

అందులోనూ దక్షిణ కొరియా అణ్వస్త్ర దేశం కూడా.. ఆ దేశం కనుక ఉక్రెయిన్‌కు అణ‌్వస్త్రాలు అందిస్తే.. పరిస్థితి దారుణంగా మారుతుంది. అప్పుడు ఈ యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. అణ్వస్త్రాలు చేసే మహా విస్ఫోటనం గురించి  తెలిసిందే. అయితే దక్షిణ కొరియా మాత్రం రష్యాకు ఎదురెళ్లి కష్టాలను ఆహ్వానించే పరిస్థితి ఉండదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మాత్రం యుద్ధలో పోరాడేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: