కొత్త జిల్లాలు: ఇప్పుడు ఏపీలో అతి పెద్ద, అతి చిన్న జిల్లాలు ఇవే?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఇప్పుడు మారిపోయింది. కొత్త జిల్లాలతో కళకళలాడుతోంది. ఒకప్పుడు 13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలను చేయాలన్న డిమాండ్, ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నాయి. జగన్ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఓ జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలెబెట్టుకున్నట్టయింది. దాదాపుగా ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఓ జిల్లాగా మార్చారు. కొన్నిచోట్ల చిన్న చిన్న మార్పులు చేశారు.

అయితే.. పాత జిల్లాల ప్రకారం ఏపీలో అతి పెద్ద జిల్లాగా అనంతపురం జిల్లా ఉండేది. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు ఆ స్థానం కోల్పోయింది. అనంతపురం జిల్లా ఇప్పుడు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించబడింది. దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఏపీలో అతి పెద్ద జిల్లాగా నిలిచింది. ఇక ఇప్పుడు ఏపీ అతి చిన్న జిల్లా ఏదో తెలుసా.. విశాఖ పట్నం.. ఎందుకంటే.. ఇప్పుడు విశాఖ పట్నం నగరంతో పాటు కొన్ని ప్రాంతాలు మాత్రమే విశాఖ జిల్లాగా ఉన్నాయి.

పాత విశాఖలోని చాలా జిల్లాలు కొత్త జిల్లాల్లోకి వెళ్లిపోయాయి. మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోకి విశాఖలోని చాలా ప్రాంతాలు వెళ్లిపోయాయి. అందువల్ల ఇప్పుడు విశాఖ ఏపీలోనే అతి చిన్న జిల్లాగా అవతరించింది. పునర్విభజన తర్వాత మారిన పాత జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. విస్తీర్ణం, జనాభా, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏపీలో 72 రెవెన్యూ డివిజన్లతో 26 జిల్లాలు ఉన్నాయి.

ఇక జనాభా పరంగా చూసుకుంటే.. నెల్లూరు అగ్రస్థానంలో ఉంది. అధిక జనాభా, మండలాల జిల్లాల్లో నెల్లూరు తొలిస్థానం దక్కింది. అధిక జనాభా, మండలాల జిల్లాల్లో ప్రకాశంకు రెండోస్థానం దక్కింది. ఈ రెండు జిల్లాల్లో8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 38 మండలాలు ఉన్నాయి. మొత్తానికి ఏపీ కి ఇప్పుడు కొత్త జిల్లాలతో కొత్త కళ వచ్చింది. అయితే.. ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నప్పుడే ఈ వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: