ఢిల్లీ : తిరుగుబాటు ఎంపీకి ఇదొక్కటే పనా ?
వైసీపీ తరపున గెలిచిన ఎంపీలందరిలోకి బాగా బిజీగా ఉండే ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కనుమూరు రఘురామకృష్ణంరాజు మాత్రమే. ఈయన మొన్నటి ఎన్నికల్లో నరసాపురం నుండి గెలిచారు. అయితే గెలవగానే జగన్మోహన్ రెడ్డితో విభేదాల వల్ల తిరుగుబాటు ఎంపీ అవతారమెత్తారు. అప్పటి నుండి ఫుల్లుగా బిజీగా ఉంటున్నారు. ఇంతకీ ఈ ఎంపీ అంత బిజీగా ఏమి చేస్తున్నారు ?
ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు. తన డైలీ ప్రోగ్రామ్ కు రచ్చబండ అని పేరుకూడా పెట్టుకున్నారు. పేరులోనే రచ్చ ఉంది కాబట్టి ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి రచ్చ చేస్తున్నారు. విచిత్రమేమిటంటే ప్రతిరోజు మీడియాలో వచ్చే వార్తలు, కథనాలను చదివి మళ్ళీ వాటినే మీడియా సమావేశంలో వినిపించటం. మరి మీడియా వాళ్ళు కూడా ఈ చెత్తను ఎలా భరిస్తున్నారో ఏంపాడో అర్ధం కావటంలేదు. జగన్ పై వీలైనంత బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు.
తానేదైనా కొత్తది కనుక్కుని మీడియాకు చెబితే బాగుంటుంది. అంతేకానీ మీడియాలో వచ్చిన వాటిని చదివి తిరిగి అవే విషయాలను మళ్ళీ మీడియా సమావేశాల్లో చెబుతున్నారంటేనే ఎంపీ ఎంత విచిత్రమైన వ్యక్తో అర్ధమవుతోంది. జగన్ పై బురదచల్లటమే ఎంపీ టార్గెట్ కాబట్టి ఇంతకన్నా చేసేందుకు ఏమీలేదు ఆయనకు. కానీ మీడియా ఎందుకు ఎంటర్ టైన్ చేస్తోంది ? ఎందుకంటే జగన్ పై బురద చల్లేందుకు ఎల్లోమీడియాకు ఎవరో ఒక వ్యక్తి కావాలి.
అందుకనే వీళ్ళు రాయటం, ఆయన చదవటం, చదవినిదాన్ని మళ్ళీ మీడియా సమావేశంలో చెప్పటం, ఆయన చెప్పిందన్ని మళ్ళీ ఎల్లోమీడియా అచ్చేయటం భలేగుంది కదా. ఢిల్లీ దాటి ఏపిలోకి వస్తే ఏమవుతుందో అందరికన్నా ఎంపీకే బాగా తెలుసు. అందుకనే తెలుగురాష్ట్రాల్లోకి అడుగుపెట్టకుండా రచ్చబండ పేరుతో ఢిల్లీలోని డైలీ రచ్చ చేస్తున్నారు. మొత్తానికి తిరుగుబాటు ఎంపీకి జగన్ పుణ్యమాని ప్రతిరోజు నోటినిండా పని దొరుకుతోంది.