ఆ మహిళ స్ఫూర్తితోనే.. కెసిఆర్ కల్యాణ లక్ష్మి ప్రవేశపెట్టారా?
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇలాంటి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కథ ఉంది అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. ఒక మహిళ యొక్క పరిస్థితులను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారు. కల్పన అనే గిరిజన మహిళతో స్ఫూర్తి పొంది కేసీఆర్ లక్ష్మి పథకం ప్రవేశ పెట్టారట. ఇంతకీ ఒక సాదాసీదా మహిళ కల్పనా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశ పెట్టడానికి ఎలా స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్టోరి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించాడు. 2002 ఏప్రిల్ పార్టీ బలోపేతం కోసం వరంగల్ జిల్లాలో పర్యటించారు కెసిఆర్ ఇక మల్లంపల్లి గ్రామం సమీపంలోని భాగ్య తండా లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక 40 ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో బాధితులను ఓదార్చేందుకు వెళ్ళిన కెసిఆర్కు ఓ మహిళ ఏడుస్తూ కనిపించింది.. ఏం జరిగింది అని అడగ్గా తన పేరు కల్పన అని తాము కొనుగోలు చేసిన బంగారం నగలు వెండి వస్తువుల తో సహా అన్ని అగ్నిప్రమాదంలో కోల్పోయామని ఇవన్నీ తమ కూతురు పెళ్లి కోసం దాచుకున్నాము అంటూ ఆమె సమాధానం చెప్పింది. ఈ పరిస్థితిని చూసి చలించి పోయిన కేసీఆర్ తాను అధికారంలోకి వస్తే ఇక పేద ఆడపిల్లలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. దీంతో అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారు.