హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..11 మంది మృతి..

Satvika
హైదరాబాద్ లో ఈ మధ్య అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. ఒక్కో ప్రమాదం ఒక్కో కారణం వల్ల జరుగుతుంది.. ఒక్కో ప్రమాదం జరిగిన ప్రతిసారి ఎందరో ప్రాణాలును కొల్పొయారు. అంతేకాదు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మరో అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం లో 11 మంది సజీవ దహనం అయ్యారు..భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన తో ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కి పడింది. ప్రాణాలును అర చేతిలో పెట్టుకొని కొందరు పరుగులు తీసి ప్రాణాలును కాపాడుకున్నారు.


విషయానికొస్తె.. ఈ ఘటన హైదరాబాద్ లోని గాంధీనగర్ లో చోటు చేసుకుంది.గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో వేకువ జామున సడెన్ గా మంటలు వ్యాపించాయి.షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలతో.. టింబర్ డిపోలోని చెక్కలు తగలబడిపోయాయి. చెక్కలు కావడంతో మంటలు భారీగా ఎగసి పడ్డాయి.. ఒక్కసారిగా మంటలు చుట్టూ ముట్టాయి.. దీంతో లోపల ఉన్న కార్మికులు బయటకు రాలెని పరిస్థితి ఏర్పడింది.


ఘటన జరిగిన సమయంలో గోడౌన్‌లో 12 మంది ఉండగా ఒకరు తీవ్ర గాయాలతో బయటపడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. అర్థరాత్రి 2 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించినట్లు విచారణలో రుజువైంది.. భారీగా మంటలు, పెద్దగా శబ్ధాలు వినిపించడం తో చుట్టూ ప్రక్కల వాళ్ళు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 8 ఫైరింజన్లతో.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు..దాదాపు గంట పాటు శ్రమించి మంటలను ఆర్పారు. చనిపోయిన వారి ఆచూకీ కోసం ఉదయం 8 గంటల వరకూ గాలించారు. 11 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా బీహార్ కు చెందిన వాళ్ళుగా గుర్థించారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: