అక్కడ పెట్రోల్ రేటు అంత చీపా!

Purushottham Vinay
ఇక గత 20 రోజులకు పైగా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధం జరుగుతుంది.ఇక ఈ యుద్ధం తరువాత పలు నిత్యవసరాలు ఇంకా అలాగే ఇతర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాల్లో పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.ఇక మన దేశంలో పెట్రోల్ ధరలు రూ.100కి పైగానే ఉన్నాయి. మరి ఇతర దేశాల్లో ఈ ధరలు ఎలా ఉన్నాయంటే.. పాకిస్తాన్ లో ఒక లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి 0.837 డాలర్లు (సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు (రూ. 84) గా ఉంది. బంగ్లాదేశ్ లో 1.035 డాలర్లు (రూ.78.43) ఉంటే నేపాల్ లో మాత్రం $1.226 (రూ.93) గా ఉంది. ఇక వెనిజులా దేశంలో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.025 డాలర్లు(రూ.1.89) గా ఉంది. ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి 0.032 డాలర్లు (రూ.2.43)గా ఉంది.


అలాగే ఇతర దేశాల్లో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం హాంగ్ కాంగ్. ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి 2.879 డాలర్లు (రూ.218)గా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్ ఇంకా అలాగే జర్మనీ వంటి దేశాల్లో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది. అయితే ఇక మన దేశంలో హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అలాగే పెట్రో ధరలు కూడా త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వచ్చేసి చేసుకుంటున్నాయి. భారత్ కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా దేశం బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: