ఆధార్ డీటెయిల్స్ మార్చుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు..!!

Purushottham Vinay
ఇక నేటి కాలంలో ఆధార్ కార్డు జనాలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది. మొబైల్ సిమ్ కార్డు పొందడం నుంచి బ్యాంకులో ఖాతా తెరవడం వరకు కూడా వీటి అన్నింటికీ ఆధార్ కార్డు అనేది చాలా తప్పనిసరిగా మారింది. ఇప్పుడు ఇండియాలో ఇది లేకుంటే మనిషికి గుర్తింపు లేదు.కానీ ఆధార్‌లో మీ పేరు ఇంకా అలాగే చిరునామా తప్పుగా పేర్కొనబడి ఉంటే లేదా ఏదైనా తప్పుగా ముద్రించబడి ఉంటే, మీరు చాలా వరకు కూడా ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆధార్ కార్డ్‌లో పేరు లేదా చిరునామాను చాలా ఈజీగా మార్చాలనుకుంటే, మీరు ఇక వాటిని ఎన్నిసార్లు మార్చవచ్చో లేదా సిరిదిద్దుకోవచ్చు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పరిమితిని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నిర్ణయించింది.



మీ పేరు...


ఆధార్ కార్డ్‌లో మీ పేరులో ఏదైనా తప్పు ఉంటే, మీరు దానిని మాక్సిమం మీరు రెండుసార్లు మార్చుకోవచ్చు. 
UIDAI నిబంధనల ప్రకారం, మీరు మీ పేరును ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సరిదిద్దుకోవచ్చు.



లింగం..


మీ ఆధార్ కార్డ్‌లో మీరు మగవారు అని మరియు ఆడవారు అని చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీరు దీని విషయంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. దీనికి సంబంధించి, 2019లో uidai ఒక నోటిఫికేషన్‌ను ప్రచురించింది. లింగంలో ఏదైనా పొరపాటు ఉంటే, మీరు దానిని ఒకసారి మార్చుకోవచ్చని, దాని కోసం మీరు ఆధార్ నమోదు / నవీకరణ కేంద్రాన్ని సందర్శించాలని చెప్పబడింది.



చిరునామా..


చాలా మంది తమ ఆధార్ కార్డులోని చిరునామా తప్పుగా ఉందని ఫిర్యాదు చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఇంటి నంబర్, వీధి నంబర్ వంటి తప్పులు తరచుగా ఆధార్‌లో తప్పుగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆధార్ కార్డ్‌లోని చిరునామాను ఒక్కసారి మాత్రమే నవీకరించగలరు.



పుట్టిన తేది..


మీరు మీ పుట్టిన తేదీలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే, uidai ప్రకారం, దానిని మూడు సంవత్సరాల వ్యవధిలో మార్చవచ్చు. అంటే, ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీ మూడు సంవత్సరాలు వెనుకబడి ఉంటే లేదా మూడు సంవత్సరాలు ముందుకు ఉంటే, దానిని మార్చలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: