అమరావతి : చంద్రబాబు బీపీ పెంచేస్తున్న పవన్ ?

Vijaya


జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ కాదుకానీ చంద్రబాబునాయుడులో బీపీ పెరిగిపోతోంది. బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడుతారో అనే విషయంపై అన్నీ పార్టీల్లోను ఆసక్తి పెరిగిపోతోంది. కానీ మిగిలిన పార్టీలు వేరు తెలుగుదేశంపార్టీ పరిస్దితి వేరు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో విజయం దక్కాలంటే పవన్ మద్దతు లేకపోతే సాధ్యం కాదని చంద్రబాబే తీర్మానించేసుకున్నారు.



తాను పవన్ కు లవ్ ప్రపోజల్ పంపినా అటునుండి సమాధానం రాలేదని చాలా బాధపడిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే బహిరంగంగా చెప్పారంటేనే రాబోయే ఎన్నికలపై ఎంత టెన్షన్లో ఉన్నారో అర్ధమైపోతోంది.  టీడీపీతో పొత్తుకు పవన్ అంగీకరించకపోతే చంద్రబాబు పని దాదాపు అయిపోయినట్లే. ఇదే సమయంలో బీజేపీకి రాబోయే లాభం కూడా ఏమీలేదు. ఎందుకంటే బీజేపీకంటు రాష్ట్రంలో ఓటుబ్యాంకంటు ఏమీలేదు. జనసేన ఓటుబ్యాంకే బీజేపీ ఓటుబ్యాంకు.



సరే ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సమస్యేమీలేదు. జగన్ మొదటినుండి నేరుగా జనాలనే నమ్ముకున్నారు కాబట్టి పొత్తుల గురించి అస్సలు ఆలోచించటంలేదు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకొచ్చే నష్టం ఏమీలేదన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికున్న గ్రౌండ్ రియాలిటీ అయితే అధికారంలోకి రావటానికి జగన్ కే మళ్ళీ అవకాశం ఉంది. జగన్ గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్ధితి తెలంగాణాలో లాగే అయిపోవటం ఖాయం.



అందుకనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. ఎలాగైనా ఆవిర్భావ సభలో ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో టీడీపీతో పొత్తుకు పవన్ తో నాలుగు మాటలు చెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. రాబోయే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ఎవరితో అయినా కలుస్తామనేట్లుగా పవన్ తో ఓ డైలాగ్ చెప్పిస్తే టీడీపీ నేతలు చాలా హ్యాపీగా ఫీలైపోతారు. కానీ ఇదే సమయంలో కమలనాదులు అంగీకరిస్తారా ? నాలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయం నేపధ్యంలో బీజేపీతో పెట్టుకోవటానికి పవన్ సాహసిస్తారా ? చూద్దాం బహిరంగసభలో పవన్ ఏమి చెబుతారో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: