గుడ్ న్యూస్.. రేషన్ షాపుల్లో గ్యాస్ సిలిండర్లు?

praveen
ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ కావాలి అంటే ఎంతలా ఇబ్బందులు తలెత్తేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వాహనం ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చేది. దీంతో మధ్యలో గ్యాస్ సిలిండర్ అయిపోయింది అంటే ఎంతో మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. చాలా కష్టపడి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లోకి వెళ్లి గ్యాస్ కొనుగోలు చేసే వారు.. కానీ నేటి రోజుల్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవలే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వాహనాలు తరచూ ప్రజల వద్దకు వస్తూ ఉండడమే కాదు.. గ్యాస్ సిలిండర్ పొందడానికి ఎన్నో రకాల ఆప్షన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి.

 ఇక ఇటీవలి కాలంలో అయితే అటు 5 కేజీల గ్యాస్ సిలిండర్ ను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. గృహ వినియోగదారులు మాత్రమే కాదు విద్యార్థులు బ్యాచ్ లర్లు వలస కార్మికులు ఇలా ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ను ఎక్కువగా వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇక ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు పెట్రోల్ బంకుల ద్వారా కూడా ఈ 5 కేజీల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చి విక్రయిస్తూ ఉండడం గమనార్హం.

 ఇకపోతే 5 కేజీల గ్యాస్ సిలిండర్ల విషయంలో మరికొన్ని రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త అందనుంది అని తెలుస్తోంది. ఎందుకంటే త్వరలో రేషన్ షాపుల్లో కూడా ఐదు కేజీల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం అయింది. అయితే ప్రభుత్వంతో చర్చల అనంతరం ఇది ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా రేషన్ షాపుల్లో 5 కేజీల గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వస్తే ఎంతో మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా విద్యార్థులు బ్యాచిలర్ లు వలస కార్మికులకు రేషన్ షాప్ లో గ్యాస్ సిలిండర్ ను అందుబాటులోకి రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Gas

సంబంధిత వార్తలు: