హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఇవాళ్టి నుంచే నుమాయిష్‌..?

Chakravarthi Kalyan
హైదరాబాదీలకు ఇది గుడ్‌ న్యూస్..కరోనా థర్డ్‌ వేవ్ కారణంగా ప్రారంభమైనట్టే ప్రారంభమై ఆగిపోయిన నమాయిష్ ఇవాళ్టి నుంచి మళ్లీ ప్రారంభం అవుతోంది. సాధారణంగా జనవరి నెలలో ఈ నుమాయిష్‌ ప్రదర్శన ఉంటుంది. ఏటా జనవరిలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఉంటుంది. అయితే.. కరోనా నేపథ్యంలో ఈసారి వాయిదా పడింది. అలా వాయిదా పడిన అఖిల భారత 81వ పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్  ఇవాళ్టి నుంచి పునః ప్రారంభం అవుతోంది.


వినోదం, విజ్ఞానంతో పాటు వస్తూ ఉత్పత్తుల మార్కెటింగ్ కు అనువైన ఈ నుమాయిష్‌ ను ఈ సాయంత్రం ప్రారంభం కానుంది. సాయంత్రం వేళల్లో నుమాయిష్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 46 రోజుల పాటు నుమాయిష్ నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4గంటల నుండి రాత్రి 10:30 వరకు నుమాయిష్ ఉంటుంది. ఇక ప్రభుత్వ సెలవు రోజుల్లో రాత్రి 11 వరకు నుమాయిష్ కొనసాగుతుందని సొసైటీ వర్గాలు వివరించాయి.


ఈ ఏడాది నుమాయిష్‌లో సుమారు 1600 స్టాల్స్ కొలువు దీరుతున్నాయి. కరోనా దృష్ట్యా మాస్క్‌ లేకుండా అనుమతించరు. అలాగే వీలైనంత వరకూ శానిటైజేషన్ కు అవకాశం కల్పిస్తారు. ధర్మల్ స్క్రీనింగ్ తర్వాతే సందర్శకులను నుమాయిష్‌ లోపలికి అనుమతిస్తారు. ఈ ఏడాది పిల్లలు, పెద్దలకు వినోదాన్ని కల్పించేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు నుమాయిష్ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజు సాయంత్రం సంగీత విభావరి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది అన్ని రాష్ట్రాలతో పాటు కాశ్మీర్ ఉత్పత్తులను కూడా నుమాయిష్ లో  విక్రయించాలని నిర్ణయించారు.


నుమాయిష్ వస్తే హైదరాబాదీలకు అదో కొత్త జోష్‌ గా చెప్పుకోవచ్చు.. షాపింగ్‌ తో పాటు వినోదం ఇక్కడి ప్రత్యేకత.. జెయింట్ వీల్‌ తో పాటు అనేక వినోద విన్యాసాలు అందరినీ అలరిస్తాయి. సందర్శకులతో కిటకిటలాడే నుమాయిష్‌లో షాపింగ్‌ చేయడం.. ఎంజాయ్‌ చేయడం అదో ప్రత్యేక అనుభూతిగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: