జగనన్న : మాకూ న్యాయం కావాలి? మళ్లీ పీఆర్సీ రగడ!
ఆరోజు మాట్లాడిన మాటలన్నీ ట్రాష్
మాకు మేం కోరుకున్న విధంగానే పీఆర్సీ కావాలి
ఉద్యోగ సంఘాల నాయకులు మమ్మల్ని మోసం చేశారు
అందుకే మా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం
చర్చలు జరిగినా కూడా ఉద్యోగులు కొత్త పీఆర్సీకి సంబంధించి శాంతించేలా లేరు.చర్చలు సఫలీకృతం అయి మంత్రుల కమిటీ నుంచి స్పష్టమయిన హామీ వచ్చిన కూడా ఉద్యోగులు తగ్గేదే లే అంటున్నారు.తాజాగా వివాదంలోకి హైకోర్టు ఉద్యోగులు వచ్చాయి. సాధ్యం అయినంత వరకూ వీరు తమ డిమాండ్ల సాధన కోసం పోరాడతామనే అంటున్నారు. అయితే వీరి ఉద్యమానికి ఉపాధ్యాయులతో సహా ఇతర అసంతృప్తవాదులు కూడా మద్దతిస్తున్నారు.ఈ సారి పొలిటికల్ పార్టీల మద్దతు తీసుకుని ఫైట్ చేయాలని కూడా కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.అదే కనుక జరిగితే పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతాయి.
యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ హైకోర్టు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. పీఆర్సీకి సంబంధించి ఇప్పటివరకూ ప్రకటించిన నిర్ణయాలు సబబుగా లేవని పేర్కొంటూ, ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించుకోవాలని కోరుతూ లేఖ రాసింది.దీంతో ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి పీఆర్సీకి సంబంధించి అశుతోష్ మిశ్రా రూపొందించిన నివేదిక పక్కన పెట్టి, మంత్రుల ఉప సంఘం రూపొందించి విధి విధానాలను ఖరారు చేయడం తగదని కూడా అంటున్నారు సంబంధిత ఉద్యోగ వర్గాలు. దీంతో హైకోర్టు ఉద్యోగులు మళ్లీ సమ్మెకు సిద్ధంఅయ్యేలానే ఉన్నారు.తమ ఆకాంక్షలేవీ పీఆర్సీ సాధన సమితి పూర్తిగా సీఎం దగ్గరవినిపించలేకపోయిందన్న ఆవేదనతోనే వీరంతా ఉన్నారు.దీంతో ఉపాధ్యాయులు, హై కోర్టు ఉద్యోగులు కలిసి రోడ్డెక్కి అనుకున్నవి సాధిస్తారని తెలుస్తోంది.