తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాధాకృష్ణ ఒకరు .ఈయన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈయన నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అద్భుతమైన జోష్ లో ఈయన నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో కంటిన్యూ అవుతున్నాడు. ఈయన నిర్మించిన సినిమాలలో కొన్ని సినిమాలు సంక్రాంతికి కూడా విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం ఈ బ్యానర్ వారు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ ని 2020 జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ఇకపోతే రాధా కృష్ణ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాను పోయిన సంవత్సరం అనగా 2024 జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేసి యావరేజ్ మూవీ గా నిలిచింది. ఇలా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మధ్య కాలంలో అలా వైకుంఠపురంలో , గుంటూరు కారం అనే రెండు సినిమాలను సంక్రాంతి భరిలో నిలిపారు. ఇందులో అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా , గుంటూరు కారం సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.