నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతికి అదరగొట్టిన బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్.. ఈ ప్రొడ్యూసర్ గ్రేట్!

Reddy P Rajasekhar
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2016 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలైంది. బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ నిర్మాతకు ఈ సినిమాతో కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. నాన్నకు ప్రేమతో మూవీకి బాక్సాఫీస్ వద్ద 54 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
 
విదేశాల్లో ఈ సినిమాను షూట్ చేయగా ఆ సమయంలో నిర్మాతలకు అక్కడి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని బెనిఫిట్స్ లభించాయని సమాచారం అందుతోంది. నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతికి ఈ నిర్మాత అదరగొట్టారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. సినిమాల లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఈ నిర్మాత సినిమాలను నిర్మిస్తున్నారు.
 
నాన్నకు ప్రేమతో సినిమాకు పోటీగా మూడు సినిమాలు విడుదల కాగా ఆ సినిమాలు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నా నాన్నకు ప్రేమతో సినిమానే బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించడం గమనార్హం. కలెక్షన్ల విషయంలో ఈ సినిమానే టాప్ లో ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ ను పెంచేసిన సినిమాలలో నాన్నకు ప్రేమతో సినిమా కూడా ఒకటి.
 
నాన్నకు ప్రేమతో సంచలన విజయం అనంతరం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. నాన్నకు ప్రేమతో సినిమా ఇతర భాషల్లో కూడా రీమేక్ అయింది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొట్టిందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ 2000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను బాక్సాఫీస్ వద్ద ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: