ఓయ్ డార్లింగూ.. అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్, చరణ్ క్రేజీ ఫోన్ కాల్?
ఇంకా ప్రసారం కాకముందే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. చరణ్, ప్రభాస్‌కు ఫోన్ చేయడం. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఆ ఫోన్ కాల్‌లో వారి మధ్య సంభాషణ వింటుంటే ఆ విషయం మరోసారి రుజువైంది. ఇంతకుముందు అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ప్రభాస్ పాల్గొన్నప్పుడు కూడా చరణ్‌కు కాల్ చేయడం విశేషం.
ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్‌లో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు చరణ్‌తో అనడం ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాదు, చరణ్ సరదాగా ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇవ్వడంతో ఒక్కసారిగా సందడి నెలకొంది. బాలయ్య బాబు వెంటనే కలుగజేసుకుని ఆ అమ్మాయి రెడ్డినా? చౌదరీనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం మరింత ఫన్‌ను క్రియేట్ చేసింది. చరణ్ మాత్రం తెలివిగా సమాధానం దాటవేస్తూ.. మీరే ఊహించుకోండి అంటూ కామెంట్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఫోన్‌లో ఉన్న ప్రభాస్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు.
వెంటనే తేరుకుని.. "రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్, నువ్వు నా ఫ్రెండ్‌వా? లేక శత్రువా?" అంటూ నవ్వుతూ అన్నాడు. ప్రభాస్ తన జీవితంలో ప్రస్తుతానికి ఎవరూ లేరని స్పష్టం చేయడంతో పుకార్లకు చెక్ పెట్టాడు. 'డార్లింగ్ డార్లింగ్' అంటూ ప్రభాస్, చరణ్‌ను పిలుచుకోవడం వింటే ఫ్యాన్స్‌కి పూనకాలే! ఈ క్లిప్ చూస్తుంటే ఫుల్ ఎపిసోడ్ ఎంత ఫన్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. అన్‌స్టాపబుల్ ఫ్యాన్స్‌తో పాటు చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది.