తమ్ముళ్ళు మామూలోళ్లు కాదు!

M N Amaleswara rao
ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు కాస్త టీడీపీకి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే...అన్నీ రంగాల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది...ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. వారి పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధమే చేస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు మారితే చాలు...రాజకీయంగా చాలా బెనిఫిట్ ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అంటే ఉద్యోగులు జగన్‌కు వ్యతిరేకంగా మారితే..అది టీడీపీకి కలిసొస్తుందని అనుకుంటున్నారు.
కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం ఉద్యోగులని నమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు..ఎందుకంటే ఉద్యోగులు ఎప్పుడు పెద్దగా చంద్రబాబుకు మద్ధతుగా నిలబడిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు ఏదో వారు తమ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నారని, అలా అని వారు బాబుకు మద్ధతు పలుకుతారు అనుకుంటే భ్రమ అవుతుందని, ఏ మాత్రం వారిని నమ్మడానికి లేదని, చివరి నిమిషంలో వారు ప్లేటు తిప్పేస్తారని, ఇప్పుడు ఏదో జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని, వారికి సపోర్ట్‌గా నిలబడితే టీడీపీకే నష్టమని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.


అసలు చెప్పాలంటే ప్రతి రాజకీయ అంశాన్ని వారు జాగ్రత్తగా చూసి మాట్లాడుతున్నారు. ఆ మధ్య జనసేనతో పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచిన విషయం తెలిసిందే. అయితే పొత్తు విషయంలో టీడీపీ నేతలు రెడీగానే ఉన్నారు...కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం పొత్తు విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చారు. అనవసరంగా జనసేనని నెత్తిన పెట్టుకుంటే ఇబ్బంది పడాలని, కావాలంటే ఒంటరిగా పోటీ చేద్దామని, లేదంటే వారే గెలిపించినట్లు జనసేన కార్యకర్తలు మాట్లాడతారని, వారి మాటలు పడలేమని తమ్ముళ్ళు ముందు నుంచి చెబుతున్నారు.
అలాగే ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కూడా సంబర పడకూడదని, వారేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి, తమకు మద్ధతు ఇచ్చేస్తారని గుడ్డిగా నమ్మవద్దని నాయకులకు సూచిస్తున్నారు. అంటే తమ్ముళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా కలిసొచ్చే అంశాలపై కూడా డౌట్ పడి...ఇంకా రాజకీయాన్ని నడిపిస్తున్న తమ్ముళ్ళు మామూలోళ్లు కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: