మోదీ బడ్జెట్ : అత్తా అబద్ధాలు చెప్పమాకు ప్లీజ్ !
ఎప్పటిలానే కాగిత రహితం తో పాటు నిజాలను దూరంగా ఉంచి బడ్జెట్ ను హాయిగా చదువుతున్నారు తెలుగింటి కోడలు నిర్మల సీతారామన్.ఎప్పటిలానే ఉద్యోగాలకు సంబంధించి మాత్రం పెద్ద అబద్ధం ఒకటి చిన్న స్వరంతో చెప్పి అందరినీ ఊరించారు. ఇక అప్పుల కోసం వెతుకులాడే ఆంధ్రాకు మాత్రం ఓ వరం ఇచ్చారు. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని చెప్పడంతో ఓ విధంగా మనకు, మన ఇరుగుకు పొరుగుకు ఓ శుభవార్త. ఈ మేరకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల అందజేతకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు.ఇదే సమయంలో రాష్ట్రాలకు ఆర్థిక సాయం కింద లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేసి రుణాలు అందించనున్నారు.అదేవిధంగా డిజటల్ కరెన్సీని ఈ ఏడాదే విడుదల చేస్తామని కూడా చెబుతున్నారు.త్వరలోనే డిజిటల్ రూపాయిని ఆర్బీఐ విడుదల చేస్తుందని అంటున్నారు.
సార్వత్రిక బడ్జెట్ కు సంబంధించి కీలక ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇస్తున్నారు.బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తూ కొన్ని ముఖ్య ప్రకటనలను చేస్తున్నారు. ముఖ్యంగా వందేళ్లకు ఓ సారి వచ్చే బడ్జెట్ గా దీనిని అభివర్ణిస్తున్నారు. పూర్తి విజన్ ఉన్న బడ్జెట్ ఇదేనని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఆమె వరాలు ప్రకటిస్తున్న ప్రతిసారీ మోడీ బల్ల చరిచి మరీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిలానే కాగిత రహిత బడ్జెట్ నే తీసుకువచ్చారు. నిర్మలా మేడమ్ ప్రసంగం వేగంగా సాగుతోంది.
ఇక గతంలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. గతంలో కూడా ఇలానే మోడీ ప్రకటన చేసి ప్రజలను మోసపుచ్చారు. మళ్లీ అదే తప్పిదం ఇవాళ బడ్జెట్ ప్రకటన ద్వారా ఎందుకు చేస్తున్నారో మరి! ముఖ్యంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేపి సంబంధిత వర్గాన్ని ఆకట్టుకోవాలన్న ఆలోచనతోనే ఆమె ఈ విధంగా నడుచుకుంటున్నారని విమర్శ కూడా మొదలయింది. పోస్ట్ బడ్జెట్ సెషన్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి,కొత్త కొలువులకు సంబంధించి ఏమయినా చెబుతారేమో మరి! ఇప్పటికప్పుడు అన్ని ఉద్యోగాల కల్పనపై కేంద్రం దగ్గర అయినా క్లారిఫికేషన్ ఉందా అన్న డౌట్ మాత్రం స్పష్టంగా విపక్షం నుంచి వస్తుంది.అన్నట్లు మరో వరం కూడా ఇప్పుడే ఇచ్చారు. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని చెప్పి జగనన్న నోట్లో చక్కెర పోశారు.