జగనన్న : పీఆర్సీ షాక్..ఉద్యోగులు రాక్ ! ట్రెండ్ ఇన్
అన్న సందేహంలో చూసేవాళ్లను
పీఆర్సీ సాధన కమిటీ నెడుతోంది
అంతగా రాజకీయం చేయడం వీరికే చెల్లు
ఆంధ్రావనిలో ఉద్యోగులు మంచి స్థాయిలోనే రాజకీయాలు చేస్తున్నారు.తాను పీఆర్సీ ఇవ్వలేనని చేతులేత్తేసిన జగన్ తో గతంలో చర్చలు జరిపారు.తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో కోరినంత ఫిట్మెంట్ కూడా ఇవ్వలేనని ఆయన ఆ రోజు చెప్పారు.అయినా సరే ఉద్యోగులు ఎంతో పట్టుబట్టి సీఎస్ తో చర్చలు జరిపారు.అవి కూడా చాలారోజులు నడిచాయి.ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమీర్ శర్మ వాస్తవిక స్థితిగతులు వివరించేందుకు ఎంతగానో ప్రయత్నించారు.తరువాత బొత్సతో ఇంకా సజ్జలతో..ఇంకా పేర్నినానితో..సంప్రతింపులు జరిపారు.ఇవన్నీ ఓ వైపు సాగుతుండగానే ఆఖరికి సీఎం సీన్లోకి వచ్చి
23 శాతం ఫిట్మెంట్ కు సిద్ధం అయ్యారు.
ఆ రోజు ఆయన దగ్గర ఒప్పుకున్న ఉద్యోగ సంఘాలు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేయకుండానే వెనక్కు వచ్చారు. తరువాత పొలిటికల్ డ్రామా ఒకటి తెరపైకి తెచ్చి తమకు అనుగుణంగా పీఆర్సీ లేదని అంటున్నారు.ఆ రోజు ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డితో చర్చలు జరపడం అన్నది నిబంధనలకు ఎంత విరుద్ధమో సీఎస్ తో కూడా చర్చలు జరపడం కూడా అంతే నిబంధనలకు విరుద్ధం.అయినా కూడా తమ అవసరాల దృష్ట్యా మంత్రులను కూడా కలుపుకుని పోయేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించాయి. తమకు అద్దె భత్యం తగ్గించారని, ఫిట్మెంట్ సరిపోదని..పాత జీతాలే ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఇక ఉద్యమంలో ఉపాధ్యాయులు వాడుతున్న భాష సరిగా లేదు అన్న వాదన నిజంగానే వాస్తవం.ముఖ్యమంత్రిపై పేరడీ పాటలు పాడడం, అదేవిదంగా ఆయన్నొక ఆర్థిక నేరస్తుడిగా చిత్రించడం అన్నవి కూడా బాలేవు. అవి వారి స్థాయికి తగ్గ మాటలు కావు.హై కోర్టు కూడా ఉద్యోగుల వాదన వినేందుకు మొన్నటి వేళ నిరాకరించింది. ఓ ప్రభుత్వంకు జీతం తగ్గించే హక్కు ఉంటుందని కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులు సమ్మెకు పోవడం తగదని కూడా సంబంధిత ధర్మాసనం గెజిటెడ్ ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షులు కేవీ కృష్ణయ్యకు చెప్పారు.అటుపై ఓ రిటైర్డ్ ప్రొఫైసర్ సమ్మె అన్నది చట్ట వ్యతిరేకం అని పిల్ ఒకటి దాఖలు చేశారు. మరోవైపు సమ్మెలోకి ఆర్టీసీ రానుండడంతో ఉద్రిక్తత పెరిగింది.అయితే వీటిని వినిపించుకునే స్థితిలో తామున్నామని, సమ్మె ముందు రోజు వరకూ కూడా తాము చర్చలకు సిద్ధమేనని బుజ్జగింపుల కమిటీ తరఫున సజ్జల, బొత్స, పేర్ని నాని చెబుతున్నారు.కానీ వీటిని పట్టించుకోకుండా ఉపాధ్యాయులు నోటికి వచ్చిన విధంగా జగన్ ను తిట్టడమే ఈ కథలో కొసమెరుపు.