జగనన్న : బాలయ్య ఊళ్లో ఉద్రిక్తతలకు కారణం ఇదే? ఆజ్ కా ఆగ్ !
ప్రతిపాదిత సత్యసాయి జిల్లా తమకు వద్దని అంటోంది టీడీపీ. ఇదెంత మాత్రం ఆమోద యోగ్యం కాదని జిల్లా కేంద్రంగా డెవలప్ అయ్యేందుకు కావాల్సిన భూమితో సహా ఇతర వనరులు పుష్కలంగా ఉన్నందున హిందూపురంనే జిల్లాగా ప్రకటించాలని బాలయ్య చేస్తున్న డిమాండ్ కు విస్తృత రీతిలో ప్రాచూర్యం వస్తోంది. ఓ విధంగా నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గం రాజకీయంగా భిక్ష పెట్టింది. అన్న గారి కుటుంబాన్ని అనంత వాసులు నెత్తిన పెట్టుకున్నారు.కనుక అక్కడి డిమాండ్ ను జాతీయ స్థాయిలో వినిపించేందుకు బాలయ్య ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాలను కలుపుకుని పోయేందుకు, ప్రత్యక్ష కార్యాచరణను ఉద్ధృతం చేసేందుకు అక్కడి నిరసనకారులు సిద్ధంగానే ఉన్నారు.వైసీపీ కూడా కొంత వరకూ సత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా ప్రకటించడంపై ఆనందంగా ఉన్నా ఇప్పుడున్న డిమాండ్ అన్నది రాజకీయంగా తమ ఉనికికి ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందని అంటోంది.
జిల్లాల ఏర్పాటుపై జగన్ ఎంతో కొంత స్పష్టతతోనే ఉన్నారు.అయితే ఆ పాటి స్పష్టత ఉండడంతోనే సమస్యలు పరిష్కారం కావని అంటున్నారు హిందూపురం వాసులు.వారికి కోపం వస్తుంది.తమ ప్రాంతానికి అన్యాయం అయిందని!వారికి ఆవేశం వస్తుంది తమకు ఎటువంటి అభివృద్ధీ లేదని! ఈ దశలో జిల్లా కేంద్రంగా హిందూపురంను ఉంచి, అటుపై హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.ఈ వాదన సబబుగానే ఉన్నా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేస్తూ ఇప్పటికే సత్యసాయి జిల్లా ప్రకటించారు. ఈ ప్రతిపాదన కూడా చాలా రోజుల
నుంచి ఉంది కానీ ఇప్పటికి కార్యరూపం దాల్చింది.ఈ దశలో ముఖ్యమంత్రి ఎటువైపు మొగ్గు చూపుతున్నారో అన్నది తెలియడం లేదు.
మరోవైపు హిందూపురం బంద్ అయితే జరుగుతోంది. నిరసనలతో ఆ ప్రాంతం అట్టుడికి పోతోంది.అఖిల పక్షం కూడా తాజా ప్రతిపాదన వైపే ఉంది. హిందూపురం జిల్లా సాధనకు బాలయ్య సైతం కదం తొక్కనున్నారు. ఆయన కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇస్తూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ కి మరింత అభివృద్ధి శోభ దక్కాలనే ఆకాంక్షిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటిదాకా ఉన్న నిరసనల రూపం మరింత పెరగనుంది. వైసీపీ అయితే పుట్టపర్తి కేంద్రంగా ప్రకటించిన సత్యసాయి జిల్లాను ఆహ్వానించగా, టీడీపీ మాత్రం వ్యతిరేకిస్తుంది. రాజకీయంగా కూడా భిన్న దృక్కులు, భిన్న దృక్పథాలు ఉండడంతో ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారం కాకపోవచ్చని తెలుస్తోంది.