జగన్ లేఖ: మోడీజీ.. మీ ఐడియా సూపర్..కానీ ఆ ఒక్కటీ..?
ప్రతిపాదనలు అన్నీ బాగానే ఉన్నాయని మెచ్చుకున్న జగన్.. ఓ విషయంలో మాత్రం చిన్నపాటి అభ్యంతరం చెప్పారు.. రాష్ట్రాల అంగీకారం లేకుండానే కేంద్రం అధికారులను డెప్యుటేషన్ కు తీసుకెళ్లే అంశంపై మరోసారి ఆలోచించాలని సీఎం తన లేఖలో కోరారు. ఐఎఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, వివిధ విభాగాలను పర్యవేక్షించే హోదాలోనూ, బాధ్యతల్లోనూ ఉంటారని తెలిపిన జగన్... అకస్మాత్తుగా కేంద్రం వారిని కోరితే రాష్ట్రాలకు కష్టం అవుతుందని తెలిపారు. కేంద్ర డెప్యుటేషన్ కు వెళ్తామని అభ్యర్ధించే ఐఎఎస్ లకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఓసీ జారీ చేస్తోందమ్ సీఎం జగన్ తన లేఖలో తెలిపారు.
రాష్ట్రాల ప్రయోజనాలు తెబ్బతినకుండా కేంద్ర డెప్యుటేషన్ వెళ్లే ఐఎఎస్ లను రిజర్వు చేస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. డెప్యుటేషన్ కు పంపే అధికారం రాష్ట్రాలకు ఉండే వెసులుబాటు వల్ల ప్రణాళికా బద్ధంగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్ మోడీకి వివరించారు. అకస్మాత్తుగా డెప్యుటేషన్ కు వెళ్లేందుకు రిలీవ్ చేయాల్సి వస్తే కీలకమైన ప్రాజెక్టులు, పథకాల లక్ష్యాలు దెబ్బతింటాయని జగన్ మోడీకి వివరించారు.
అదే సమయంలో ఆ ఐఎఎస్ అధికారి కుటుంబం, పిల్లల చదువులు కూడా ఒడిదుడుకులకు లోనవుతాయని.. ఆ పరిస్థితుల్లో అధికారులు పూర్తిస్థాయి సామర్ద్యాన్ని కనపర్చలేకపోవచ్చని సీఎం జగన్ తన లేఖలో తెలిపారు. అందుకే అఖిలభారత సర్వీసు రూల్స్ సవరణ ప్రతిపాదనల్ని పునరాలోచించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.