డిస్కషన్ పాయింట్ : సమ్మె సబబేనా?

RATNA KISHORE
వేతనాలు పెంపు సాధ్యం కాదని జగన్ చెప్పి ఉంటే ఇంత గొడవే ఉండకపోదును. కానీ జగన్ ఆ విధంగా చెప్పకుండా ఆర్థికంగా ఏమీ అనుకూలంగా లేకపోయినా  పాత జీతాలేవో కొనసాగించేందుకు ఇష్టపడక కొత్త పీఆర్సీ అంటూ ప్రకటన చేయడం పెద్ద తప్పుగా పరిగణిస్తున్నారు వైసీపీ వర్గాలు.ఇప్పుడున్న తలనొప్పులకు తోడుగా ఈ కొత్త తలనొప్పి మనకెందుకు అని జగన్ ను ఉద్దేశించి చాలా మంది వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రామ సచివాలయంలో లేని తలనొప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు వస్తుందని మండిపడుతున్నారు. ఈ దశలో సమ్మె పేరు చెప్పి కొంప కొల్లేరు చేసేలాఉన్నారని ఉద్యోగులను ఉద్దేశించి అంటున్నారు సంబంధిత  వర్గాల వారు. కనుక సమ్మె అయితే సబబు కాదు.కాదు కానీ వాళ్లు ఒప్పుకోరు. జీతం పెంచకపోతే ఏమయినా చేస్తాం ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అని గొంతెమ్మ కోరికల సాధనకు సిద్ధం అవుతున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహం వచ్చినా వాటిని పట్టించుకునే ఓపిక కానీ తీరిక కానీ ఉద్యోగికి లేకపోవడమే విచారకరం.
 


ఆంధ్రావనిలో జగన్ కు ఉద్యోగులకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. సమ్మెకు వెళ్లాలని కూడా ఉద్యోగులు నిర్ణయించి ఆ మేరకు కార్యాచరణను సైతం సిద్ధం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వాస్తవాలు వివరిస్తూ వైసీపీ మీడియా ఉద్యోగుల విషయమై తాము ఎంచుకున్న విధానం, పాటిస్తున్న పద్ధతి ఇవన్నీ కూడా వెలుగులోకి ఉంచేందుకు చూస్తోంది. ఈ మేరకు  వైసీపీ మీడియా తరఫున  ఉద్యోగులు చెప్పేవాటికి, ప్రభుత్వం చెబుతున్న వాటికి మధ్య ఉన్న వ్యత్యాసాలు గుర్తించాలని కోరుతోంది.ఇక త్వరలోనే సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు.అదే గనుక జరిగి ఆర్థిక వ్యవస్థ మరింత అస్తవ్యస్తం కావడం ఖాయం.


ఇక ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ప్రభుత్వ కార్యాలయాలు పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోతాయి. ముఖ్యంగా చాలా పథకాలు లబ్ధిదారులకు అందకుండా పోతాయి.ప్రస్తుతానికి సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని పనులు చేయాల్సింది పాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేయాల్సింది ఉద్యోగులే! అన్నింటి కన్నా ప్రభుత్వ ఆదాయాలు, పన్నుల వసూలు వీటితో పాటు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. సమ్మెకు వెళ్లకుండా ఉండే మధ్యేమార్గం ఒకటి వెతుక్కుని ఆ విధంగా ఉద్యోగులు నిరసనలు తెలిపితే మేలు అన్న అభిప్రాయం ఒకటి వినిపిస్తోంది.


ఇంకోవైపు ధరల పెరుగుదలను సాకుగా చూసి జీతాలు పెంచమని చెబుతున్నారు.ఇదే సందర్భంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి జీతం ఎంతని? మరి! ఆయనకు ధరల పెరుగుదల అన్నది వర్తించడం లేదా? ఎనిమిది వేల జీతగాడికి ఎనభై వేల జీతగాడికీ ఒకే సమస్య ఉంటుందా? ఉంటే అలాంటప్పుడు ఉద్యోగులకు ఎంత జీతం ఇచ్చిన చాలదనే నిర్ణయమే ఒకటి వెలుగులోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: