డోలో టాబ్లెట్.. సరికొత్త రికార్డు?

praveen
కరోనా వైరస్ మహమ్మారి వచ్చిన తర్వాత అందరిలో ఎంతలా ప్రాణభయం పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించాలి పెద్ద ఇల్లు కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని కోరుకునే వారు ప్రతి ఒక్కరు. దీని కోసం జీవన పోరాటం సాగించే వారు. ఆరోగ్యం గురించి కాస్త అయినా సమయం కేటాయించేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో పెద్ద పెద్ద బంగ్లాలు విలాసవంతమైన జీవితం కాదు ఎంతో ఆరోగ్యంగా అంటూ మూడు పూటలా తిండి తినగలిగితే చాలు అని ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చేలా చేసింది కరోనా వైరస్.

 ముందు ఒకప్పుడు డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టిన అందరు ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పై దృష్టి పెట్టారు. ఇక ఇటీవల కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా డాక్టర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా వైరస్  ఎంతో మంది హెల్త్కేర్ మరియు ఫార్మా ప్లేయర్లకు భారీగా లాభాలనే తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో dolo-650 టాబ్లెట్లు ఎంత విపరీతంగా ఉపయోగించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  వైరస్ బారిన పడిన వారు మాత్రమే కాదు లక్షణాలు కాస్త కనిపించిన కూడా డోలో టాబ్లెట్ వేసుకోవడం మొదలుపెట్టారు అందరు.

 ఇక పోతే ఇక ఇప్పుడు అందరూ వాడే డోలో 650 టాబ్లెట్ రికార్డు సృష్టించింది.2020లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 350 కోట్లకు పైగా డోలో టాబ్లెట్స్ ను విక్రయించడం గమనార్హం. హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ అయిన iQVIA దీనిపై సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే 2019లో కరోనా వైరస్ వ్యాప్తి ముందు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ తయారుచేసిన పారాసెట్మాల్ టాబ్లెట్ డోలో ఏకంగా 7.5 కోట్ల స్ట్రిప్స్ లను విక్రయించగా.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అందరికీ వైద్యులు సూచిస్తున్న జ్వరం ఔషధంగా డోలో మారిపోయింది. కేవలం 2021 లోనే 307 కోట్ల టర్నోవర్  నమోదు చేసింది డోలో. ఇక జి.ఎస్.కె ఫార్మాస్యూటికల్స్ తమ ఉత్పత్తి కాళ్పోల్ తో 310 కోట్ల టర్నోవర్ రాగా.. ఇక క్రొసిన్ 23.6 కోట్ల విక్రయాలు నమోదు చేసినట్లు సర్వే చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: