షాక్:వారియర్ టైటిల్ కోసం.. ఇద్దరు హీరోలు వార్..!!

Divya
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని... తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ ని చేయబోతున్నారు. ఈ సినిమాని ఒకేసారి తమిళ ,తెలుగు భాషలలో చిత్రీకరణ జరుగుతోంది.. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎటువంటి టైటిల్ ను నిర్ణయించలేదు.కేవలం RAPO-19 అనే టైటిల్ గా ఉంచారు.. అయితే ఈ రోజున కొద్ది గంటల ముందు ఈ సినిమాకి "ది వారియర్"అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఇందులో హీరో రామ్ ఖాకీ యూనిఫాంలో... ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి గా కనిపించబోతున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ టైటిల్ కాస్తా వివాదంగా మారుతోంది.. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
రామ్ ఈ చిత్రానికి వారియర్.. అనే టైటిల్ ను పెట్టగా..ప్రొడ్యూసర్ హవీష్ కోనేరు అందుకు అభ్యంతరం తెలిపినట్లు గా తెలుస్తోంది. అందుకు గల కారణం ఏమిటంటే హవీష్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నాడు.. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా టైటిల్ ని వారియర్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందట. ఇప్పుడు అదే టైటిల్ తో ఈ సినిమా రావడంతో ఆయన.. ఈ టైటిల్ తనదే అని ప్రకటించడం జరిగింది. త్వరలోనే అందుకు సంబంధించి విషయాలను కూడా తెలియజేస్తానని తెలిపారు.
అయితే ఈ విషయం డైరెక్టర్ హీరో దగ్గరికి వెళ్లగా.. ఆ సినిమాకి చిన్న మార్పు తో.. ది వారియర్"అనే టైటిల్ ను పెట్టడం జరిగింది. కేవలం ఈ సినిమా టైటిల్ ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకే ఇలా చేశారట చిత్రయూనిట్ సభ్యులు. కానీ ఈ సినిమాని ఎలాగైనా వారియర్ అనే పేరుతోనే పిలుస్తారని ఆయన అభిమానులు చెప్పవచ్చు.. అయితే ఈ విషయంపై హవీష్ ఒక వెబ్ పోర్టల్ ద్వారా మాట్లాడుతూ అందుకు నేను అనుమతించని తెలియజేశాడు. అయితే ఈ విషయాన్ని ఫిలింఛాంబర్ లో కూడా తెలియజేశారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: