మోదీ కడుపు మండేలా.. కేసీఆర్ నిర్ణయం..?

Chakravarthi Kalyan
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల తరచూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో బలమైన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అయినా సరే.. ఆ పార్టీని కేసీఆర్ లైట్‌గా తీసుకుంటూ అసలు ప్రత్యర్థిగా బీజేపీని ఆయన ఎంచుకుంటున్నారు. తరచూ ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ.. టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఇది ఇప్పటి వరకూ రాష్ట్రానికి సంబంధించిన విషయాల వరకే సాగింది. కానీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకంగా జాతీయ స్థాయిలో పని చేయాలని కేసీఆర్ ఇప్పుడు కృత నిశ్చయంతో ఉన్నారు.

కేసీఆర్ కి దిల్లీ రాజకీయాలు ఇవాళ కొత్త కాదు.. గతంలోనూ ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా పార్టీలను ముఠాకడదామని ప్రయత్నించి కూడా ఎందుకనో దాన్ని మధ్యలోనే వదిలేశారు. కానీ ఇప్పడు మాత్రం చాలా బలంగా బీజేపీ వ్యతిరేక ఎజెండాను కేసీఆర్ భుజానికెత్తుకుంటున్నారు. ఇందుకోసం తాజాగా టీఆర్ఎస్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో సమాజవాది పార్టీ తరపున టీఆర్ఎస్ నేతలు  ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు.

అంతే కాదు.. యూపీ వెళ్లే టీఆర్ఎస్ నాయకత్వ బృందానికి మంత్రి కేటీఆర్ నాయకత్వం వహిస్తున్నారని సమాచారం ఉంది. కేటిఆర్ ఆధ్వర్యంలోని ఒక బృందం యూపీ వెళ్లి ఎస్పీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొనవచ్చని అంటున్నారు. సమాజవాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సీఎం కేసీఆర్‌తోగానీ, టీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందంతో గానీ భేటీ అయ్యే అవకాశం ఉందట.

ఉత్తర ప్రదేశ్  ఎన్నికల్లో గులాబీ ప్రచార బృందానికి మంత్రి కేటీఆర్‌ నేతృత్వం వహిస్తారని తెలిసింది.  సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, ర్యాలీల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొంటారు. ఎలాగూ కేటీఆర్‌ హిందీ ఇంగ్లీష్‌ రెండు భాషల్లోనూ దంచేస్తారు. కేటీఆర్‌ కి తోడు కాస్త హిందీ వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలను యూపీలో ఎస్పీ తరపున ప్రచారానికి పంపనున్నట్టు సమాచారం. అదే జరిగితే.. ఈ నిర్ణయం ప్రధాని మోడీ కడుపుమండించొచ్చు. ఏమైనా జరగొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: