ఉత్తరాది దారుల్లో గులాబీ వనం నిర్మిస్తాడా? ఆశపడు కేసీఆర్!
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ తరువాత కూడా ఇదే హవాను కొనసాగిస్తారని అనుకుని తీరలేం.కానీ ఏ మాటకు ఆ మాట యూపీలో తనదైన ముద్ర వేయాలని మాత్రం భావిస్తున్నారు.తద్వారా ప్రాంతీయ పార్టీల కూటమికి సమాయత్తం కావాలని యోచిస్తున్నారు.ఇప్పటికే యాదాద్రి పనుల్లోభాగంగా బాగా బిజీగా ఉన్న కేసీఆర్ మార్చిలో యాద్రాద్రి పునర్నిర్మాణం అనంతర ప్రారంభోత్సవం అయ్యాక తనదైన వేగంతో దేశ రాజకీయాల్లో పనిచేయాలని యోచిస్తున్నారు.
యూపీ ఎన్నికల్లో గులాబీ దండు తనదైన ప్రభావం చూపాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళిక సైతం రూపొందించి,అమలు చేయాలని చూస్తోంది.సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ఉంటూ ఓ ప్రాంతీయ కూటమి ఏర్పాటుకు ఎప్పటి నుంచో చేస్తున్నా ఆలోచనకు కార్యరూపం ఇవ్వనుంది.కేసీఆర్ ప్రధాని కల నెరవేరకపోయినా సరే ...కొన్నింట అయినా టీఆర్ఎస్ తన ప్రభావం చూపించాలని భావిస్తోంది.ఇందులో భాగంగా యువరాజా కేటీఆర్ సీన్ లోకి రానున్నారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటనలు చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు.వీటికి సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. అన్నీకుదురుకుంటే కేటీఆర్ ప్రచారం చేయడం ఖాయం. తెలుగు మాట్లాడేవారు ఉన్న ప్రాంతాలలో కేటీఆర్ ప్రచారం చేయనున్నారని ప్రధాన స్రవంతి లో ఉన్న మాధ్యమం చెబుతోంది.