డ్రైవర్ లేకుండా దున్నేస్తున్న ట్రాక్టర్.. ఫోన్ లోనే ఆపరేటింగ్?

praveen
ఎప్పటికప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే రానురాను ప్రతి విషయంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా  వ్యవసాయ రంగంలో అనూహ్యమైన మార్పులు ప్రస్తుతం వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కేవలం మనుషుల ద్వారా మాత్రమే వ్యవసాయం లోని అన్ని రకాల పనులు జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం మనుషులు లేకపోయినా కూడా అన్ని రకాల పనులను మిషిన్ లే చేసేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అలా ప్రస్తుతం సరి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇలా అందుబాటులోకి వచ్చిన సరికొత్త టెక్నాలజీ అటు వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ఒకప్పుడు కేవలం ఎద్దులతో నాగలి కట్టి  పొలం దున్నడం చేసేవారు రైతులు. ఒకవేళ ఎద్దులు లేకపోతే ఇక ఇద్దరు మనుషులు ఎద్దులాగా  ముందు నిలబడి నాగలిని లాగటం లాంటిది  చేసేవారు. ఇలా  పొలం దున్నడం దగ్గరనుంచి నాటు వేయడం వరి కోయడం వరకు కూడా అన్ని మనుషులే చేసే వారు.  కానీ ఇటీవల కాలంలో టెక్నాలజీ మారిపోయింది. ఇక ఇప్పుడు ఎద్దులతో పొలం దున్నడం ఎక్కడా కనిపించడంలేదు. ట్రాక్టర్లు రయ్యి రయ్యి మంటూ నిమిషాల్లోనే పొలం పొలం దున్నెస్తున్నాయ్. ఇక నాటు వేయడం దగ్గర నుంచి వరి కోయడం వరకు కూడా మిషన్ లు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు టెక్నాలజీ మరింత కొత్త పుంతలు తొక్కింది అన్నది అర్ధమవుతుంది. ఇప్పటివరకు పొలంలో ట్రాక్టర్ దున్నటం అంటే తప్పకుండా డ్రైవర్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం డ్రైవర్ అవసరం లేదు. డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ పొలం దున్నే స్తుంది. ఇటీవలే జాన్డీర్ కంపెనీ డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్ ను రూపొందించింది. అమెరికాలో దీన్ని ఇటీవలే ప్రదర్శించింది ఆ సంస్థ. ఈ ఏడాదిలో సరికొత్త టెక్నాలజీతో కూడిన ఈ ట్రాక్టర్ ను మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. 8 ఆర్ అని పిలిచే ఈ ట్రాక్టర్ను రైతులు కేవల స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక అంగుళం దూరంలో ఏదైనా తగిలే ఛాన్స్ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ల ఆధారంగా వెంటనే ట్రాక్టర్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇక ఈ ట్రాక్టర్ లో ఆరు స్టీరియో కెమెరాలు, జిపిఎస్ కూడా ఉంటాయి అని చెబుతోంది ఆ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: