ట్రోల్ వర్డ్ : ఎడారి..అమరావతి.. అనొచ్చా?
ప్రాణ ధార అలాంటి నేలను
కృష్ణమ్మ పరవళ్లుతో నేల పులకించిన చోటు రాజధాని నిర్మాణం అంటూ ఆ ప్రాంత స్వరూపాన్ని పూర్తిగా మార్చేయాలన్న ఆలోచన, ఆతృతతో రాజధాని పేరిట భూములు సేకరించిన చంద్రబాబును తిట్టండి ఎవ్వరూ కాదనం కానీ మా బంగరు నేలలను ఎడారి అంటే అస్సలు ఒప్పుకోం..ఇది శ్రీకాకుళం నుంచి అనంత వరకూ వినిపించే వాదం కావొచ్చు..కాకపోవచ్చు కానీ ఒక నేలను ఒక ప్రాంత స్థిరత్వాన్నీ,అస్తిత్వాన్నీ ఏమీకాకుండా చేయడం చంద్రబాబు తప్పు! అంతేకానీ ఈ నేలను ముఖ్యంగా ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన గుంటూరు,కృష్ణా పరిసర ప్రాంతాలను (రాజధానిగా నోటిఫై చేసిన) కించపరిస్తే ఒప్పేదే లేదు..ఒప్పుకునేదే లేదు.కనీస విజ్ఞతతో మాట్లాడండి..మేం అమరావతి అనే రాజధానికి వ్యతిరేకం అని చెప్పండి వింటాం..అంతేకానీ ఇది ఒక ఎడారి అని చెప్పడం ఎంత మాత్రం భావ్యం కాదు..అది రైతన్నకు జీవధార..ప్రాణ ధార అలాంటి నేలను జగన్ విమర్శిస్తే ఒప్పుకోవడం అన్నది జరగదు గాక జరగదు.
అమరావతికి సంబంధించి వైసీపీ అధినేత మొదలుకుని చిన్న,చిన్న నాయకులు వరకూ అంతా ఒకే వాదం వినిపిస్తున్నారు. అయితే ఈ వాదనలో అస్సలు వాస్తవం లేదు.ఎందుకంటే ఈ ప్రాంతం భౌగోళిక సమగ్రత,అదేవిధంగా ఇక్కడి సౌందర్యం,ఈ నేల లక్షణం ఇవన్నీ తెలుసుకోకుండానే జగన్ మాట్లాడుతున్నారా లేదా ఆ రోజు అమరావతి రాజధాని అనగానే ఇవేవీ తెలియకుండానే ఆయన ఒప్పుకున్నారా? ఒకవేళ ఎడారి అనే అనుకుందాం నీళ్లు దొరకని నేలల్లో ఎవ్వరైనా తాడేపల్లి లాంటి ప్రాంతంలో ప్యాలెస్లు నిర్మించుకుంటారా చెప్పండి..?
ఈ తరుణంలో/ఈ నేపథ్యంలో
అమరావతిని ఎడారితో పోల్చారు విప్ గడికోట శ్రీకాంత్.కానీ అదంతా తప్పు అని అంటున్నాయి గత కాల పరిణామాలు. ఎంత తప్పు ముక్కారు పంటలు పండే నేలను చూసి ఎడారి అని ఎలా అంటారు అని నిన్నమొన్నటి వేళ వైసీపీ లీడర్లను ప్రశ్నించాను నేను. అదేంటండి అలా అంటారు ఎడారి అన్న పదం ఎంత తప్పు? మీకు నచ్చకుంటే లేదు కానీ ఒకప్పుడు ఈ నేల పచ్చని సిరులకు ఆనవాలు అలా అనడం తప్పు అని పదే పదే చెప్పాను. అప్పుడు వైసీపీ లీడర్లు కొంత తమని తాము దిద్దుకుని చంద్రబాబు వచ్చాక ఈ ప్రాంతం ఎడారి గా మారింది అని చెప్పాలండి మావాళ్లు ఆ మాట చేర్చకపోవడం వలనే ఇంతటి ఇబ్బంది అంటూ మరోసారి స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి.