కేసీఆర్ కు బండి సంజయ్ థ్యాంక్స్.. ఎందుకంటే?
కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారని.. మేం కేంద్రంలో అధికారంలో ఉన్నామనే సంగతి గుర్తుంచుకోవాలని.. నన్ను జైలుకు పంపినవ్ కదా....నన్ను జైలుకు పంపడం ద్వారా నీవెంత మూర్ఖుడివో, రాక్షసుడివో, నీచుడివో జనానికి అర్ధమైందని బండి సంజయ్ అన్నారు. ఇందుకు హ్యాట్సాఫ్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. జనం కేసీఆర్‌ను థూ.. అంటున్నరని.. కేసీఆర్ సెక్యురిటీ లేకుండా బయట తిరిగితే టీచర్లు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు రాళ్లతో కొడతారని బండి సంజయ్ విమర్శించారు.
ఉద్యోగుల విషయంలో సీనియర్లకు, జూనియర్లకు కొట్లాట పెట్టవద్దని.. ఆ జీవోను సవరించుకోవాలని.. విడో, దివ్యాంగులకు, స్పౌజ్ లకు అవకాశం కల్పించాలని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని.. అన్నారు. 317 జీవో సవరించేదాకా కొట్లాడతామని.. టీచర్లు కూడా దయచేసి స్పందించాలని.. ఇప్పుడు స్పందించకపోతే మీ జీవితాలు నాశనమైతాయని బండి సంజయ్ హెచ్చరించారు.
టీచర్లకు అండగా మేముంటామన్న బండి సంజయ్.. మీ ఉద్యోగాలు పోతే మేం అధికారంలోకి వచ్చాక మేమిస్తామన్నారు. మీ గురించి మాట్లాడని సంఘాల వీపంతా సాఫ్ చేయండి అని బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ఇక యుద్దం స్టార్ట్ అయ్యిందని.. కేసీఆర్ ను గుంజుకుపోయి జైల్లో వేసే రోజు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.