హ్యాపీ సండే : జగన్ కు ఆ ఫోబియో ఉందా? అందుకేనా ఊగిపోతాండు!
ఏదో ఒకటి నిర్ణయించాలి
లేదా ఏదో ఒకటి అర్థం చేసుకుని తీరాలి
ఎవ్వరినో ఒకరిని నమ్మి చేరదీశాక మళ్లీ వారినే
పదే పదే నమ్మేందుకు ప్రయత్నించాలి
సలహాలు విని విమర్శలు వద్దని
చెప్పడం కూడా పెద్ద తప్పు
జగన్ విమర్శ వినడు ప్రశంసలంటే
ఇష్టపడ్తాడు అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాట
అందుకనో ఎందుకనో ఆయన చుట్టూ
ఓ భజన బృందం ఉంటుంది
అంతరాత్మకు అనుగుణంగా నడుచుకోవడంలో తృప్తి ఉంటుంది.అంతరాత్మను వ్యతిరేకించి నడుచుకుంటే ప్రజా వ్యతిరేకత తప్పక ఉంటుంది. ఈ రెండూ తెలుసుకుని పాలకులు పనిచేస్తేనే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి లేదా వస్తాయి. కానీ మన పాలకులకు అవేవీ పట్టవు. ఎన్నో తప్పుడు నిర్ణయాలు ప్రతిరోజూ తీసుకుంటూ ప్రజాగ్రహానికి లోనయినా, సరైన దిశానిర్దేశం లేక అవస్థ పడుతున్నా కనీసం మాట మాత్రంగా అయినా ఇది మంచి ఇది చెడు అని చెప్పినా చెప్పించినా ఆయనకు కోపం వస్తాంది. ఆ మాటకు వస్తే ఆయన సీనియర్లను అస్సలు పట్టించుకోకపోవడానికి కారణం కూడా ఇదే!
తన ఇగోకు దగ్గరగా ఉండే మనుషులు మాత్రమే ఆయన రానిస్తారు.మాట్లాడనిస్తారు.అందరి కన్నా పెద్ది రెడ్డి తెలివైన వారని మిగతావారికి ఇంకా ఏం తెలియదని వందో సారో వెయ్యో సారో ఆయన అనుకున్నారని గతంలో చాలా మంది ఎమ్మెల్యేలూ మరియు మంత్రి వర్గ సహచరులూ బాధపడ్డారు. ఈ విధంగా ఎవ్వరు ఏమన్నా అనుకున్నా జగన్ ఆలోచన సరళిలో ఎటువంటి మార్పూ ఉండదు. పెద్ది రెడ్డి తప్ప ఇంకెవ్వరికీ తన పక్కన నిలుచొనే ధైర్యం కూడా ఇవ్వరు. ఓ మాట చెప్పాలంటే పెద్ది రెడ్డి కూడా ఇలానే విమర్శను అంగీకరించరు కనుక జగన్ బాబుకు ఆ..బాబు అంటే అంత ఇష్టం.
విమర్శను వినిపించుకోడు.తట్టుకోడు.తట్టుకోలేడు కూడా!అందుకే ఎవ్వరు ఏమి చెప్పినా విని వదిలేసేంత గొప్పనయిన లక్షణం మరియు ధైర్య గుణం వారికి మాత్రమే ఉంది అని అనుకోవాలిక.జగన్ అంటే సీఎం అని అందుకే అంటుండేది.ఆయనేం చెప్పినా ద బెస్టు..ఆయన రాసినా ద బెస్టు.ఆయన చూపు మరియు మాట ఓ మురిపెం ఓ అపురూపం కూడా!అందుకే మనం ఆయనేం చెప్పినా విని నవ్వి ఊరుకోవాలి. ఆయనేం చేసినా నిలదీయకూడదు.ప్రశ్నించకూడదు.అస్సలు అనుమానం అన్నది వ్యక్తం చేయకుండా సైలెంట్ గా ఉండాలి. ఉంటేనే ఆయనకు ఆనందం. లేకపోతే అస్సలు ఆయనకు కోపం అదుపులో ఉండదు. అంతూపొంతూ లేని కోపం కారణంగా ఆయన అప్పుడప్పుడూ బ్యాడ్ కూడా అవుతుంటారు.బ్యాడ్ అంటే బ్యాడ్ అనే అర్థం. మళ్లీ వేర్వేరు అర్థాలు తీసుకోవద్దు.అపార్థాలూ తీసుకోవద్దు. ఏం చేసినా సైలెంట్ గా ఉండండి. ఏం చేయకున్నా కూడా ఏమీ మీడియా ముఖంగానో, సభా ముఖంగానో, డిజిటల్ మీడియా ముఖంగానో ఏమీ అడగకండి వింటున్నారా?