సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ అండ్ హాట్ హీరోయిన్ సమంత 'మీతో మీరు మీలో మీరు నిజాయితీగా ఉండండి' అంటూ ఓ భావోద్వేగమైన మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఉన్నట్టు ఉండి సమంత ఈ సందేశాన్ని ఎందుకు పోస్ట్ చేసిందో ఒక్కసారి చూద్దామా. అయితే కొత్త ఏడాది కదా.. అందుకే, కాస్త కొత్తగా ఆలోచించి మొత్తానికి ఈ కొత్త మెసేజ్ ను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా 2021 సంవత్సరం సమంతకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం అనే చెప్పాలి.
అయితే నాగచైతన్యతో విడాకుల వ్యవహారం ఇంకా అలాగే సమంత ఎఫైర్లు అంటూ వచ్చిన లేనిపోని పుకార్లు, ఇక ఆ పుకార్ల ప్రభావం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది. అయితే ఒక విధంగా తన జీవితంలో వచ్చిన అతి పెద్ద కష్టం నుంచి సమంత చాలా త్వరగా బయటపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రానున్న 2022 కొత్త ఏడాదికి సమంత గ్రాండ్ స్వాగతం చెప్పాలని డిసైడ్ అయినట్లు చెప్పకనే చెప్పింది. తన పాత జ్ఞాపకాలన్నిటినీ మరచిపోవాలని డిసైడ్ అయ్యింది సమంత.
ఈ తరుణంలోనే బాధలన్నిటినీ మర్చిపోయి మరి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే, గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేయాలి కదా.. కాబట్టి వదిలేసినట్లు తెలుస్తుంది. అయితే ఊరికినే వదిలేస్తే ఏం బాగుంటుందని.. అందుకే, తన ఇన్ స్టా అకౌంట్ లో ఒక ఎమోషనల్ మెసేజ్ ను షేర్  చేశారు.
ఇక ఈ 2022లో ఎంతో బలంగా, ఎంతో తెలివిగా, అలాగే దయగల వ్యక్తిగా ఉంటానని, తనతోపాటే అందరూ అలాంటి లక్షణాలు అలవరచుకోవాలని మేసేజ్ చేశారు. అంతేకాదు..  మీ అతి పెద్ద లక్ష్యం దూరంగా కనిపిస్తే, సాధారణ జీవితాన్ని కూడా సంతోషంగా, పండగలా గడపండి, అన్ని విజయాలు వరిస్తాయి' అంటూ సమంత మెసేజ్ పోస్ట్  చేసింది సమంత. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం సమంతని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ముందు నీతులు చెప్పడం ఆపి నువ్వు సరిగ్గా ఉండంటూ సమంతని ట్రోల్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: