హ్యాపీ న్యూ ఇయర్ 2022 : కాపు నేతల్లో చీలికలు పీలికలు? కారణం ఎవరంటే?
బీజేపీలో రాజులున్నప్పటికీ వీరంతా కూడా అవసరం అయితే కాపులకు మద్దతిచ్చి,జనసేన గెలుపునకు ఒకవేళ సహకరిస్తే పవన్ ఆ రెండు జిల్లాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.రాజ్యాధికారం సాధించడంలో అటు పవన్ కానీ ఇటు ముద్రగడ కానీ ఏ ప్రాంతీయ పార్టీలకూ అండగా లేకపోతే ఈ సారి ఆ రెండు పార్టీలకూ అనుకూల ఫలితాలు రావు గాక రావు.ఆ విధంగా పవన్ వచ్చే ఎన్నికల సమయానికి కీలక నేతగా ఆవిర్భవించి గతంలో కన్నా ఎక్కువగానే ఓట్లు చీల్చి ప్రధాన పార్టీలు (వైసీపీ,టీడీపీ)లకు చుక్కలు చూపించనున్నారు.ఇప్పటికిప్పుడు పొత్తులు తేలలేదు కనుక ముద్రగడ కూడా సీన్లో ఆఖరి వరకూ ఉంటే కొన్ని ఓట్లు ఆయన బలపరిచిన ప్రతినిధులకు పడేందుకు వీలుంది.ఒకవేళ ఆయన పార్టీ ప్రారంభించి కొంత మంది తన వారికి అవకాశాలు ఇస్తే అలా చూసుకున్నా ఓట్ల చీలిక సాధ్యమే!
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో
వచ్చే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే విశాఖ జిల్లా, పాయకరావు పేట మండలం, గుంటపల్లి గ్రామం నుంచి వ్యూహాలు పన్నాలని చూస్తున్నారు కాపు నేతలు.ఇటీవల అక్కడ కాపు నేత వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా కాపు నేతలంతా ఒకే వేదిక పైకి వచ్చి పార్టీలకు అతీతంగా ఐక్యత చాటారు. రానున్న కాలంలో రాజ్యాధికారం తమదే అని చెప్పారు. ఈ వేడుకకు గంటా శ్రీను హాజరయ్యా రు.కీలక వ్యాఖ్యలు చేశారు.ఇవన్నీ ఎలా ఉన్నా కాపులంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకుంటున్న మాట వాస్తవమే అయినా పార్టీకతీతంగా వీరంతా పనిచేసినా,ఆశించిన ఫలితాలు వస్తాయా?