CJI NV Ramana : త్వరలో కొత్త న్యాయమూర్తుల నియామ‌కం..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టులో న్యాయ‌మూర్తుల కొర‌త‌ను త్వ‌ర‌లో తీరుస్తాం అని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వెల్ల‌డించారు. ఇవాళ  హైకోర్టు ప్రాంగ‌ణంలో బార్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. హై కోర్టులో భారీగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని పేర్కొన్నారు సీజేఐ. త్వ‌ర‌లోనే కొత్త న్యాయ‌మూర్తుల నియామ‌కాన్ని పెండింగ్‌లో పూర్తి చేస్తాం అని, దీనికి సంబంధించిన లిస్ట్ సిద్ధం చేయాల‌ని హై కోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు సూచించిన‌ట్టు వివ‌రించారు.
అమ‌రావ‌తిలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణకు అపూర్వ స్వాగతం ల‌భించిన‌ది. సీజేఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆయ‌న తొలిసారి ఇవాళ అమ‌రావ‌తికి వ‌చ్చారు. మూడు రోజుల ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీజేఐ నాగార్జున యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన ఏపీ న్యాయాధికారుల స‌మావేశంలో పాల్గొన్నారు. అనంత‌రం అమ‌రావ‌తికి బ‌య‌లు దేరారు ఎన్వీ ర‌మ‌ణ‌. నేల‌పాడులోని హై కోర్టులో బార్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో సీజేఐకు స‌న్మానం చేసారు.
 
ఆ త‌రువాత సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ మీడియాతో మాట్లాడారు. న్యాయ‌వాదులు స‌మాజానికి మార్గ‌ద‌ర్శ‌కులు అని, ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌ని చేస్తున్నారు అని గుర్తు చేసారు. స‌మాజ శ్రేయ‌స్సు కోసం న్యాయ‌వాదులు త‌మ శ‌క్తియుక్తుల‌ను ఉప‌యోగించాలి అని పేర్కొన్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ కీర్తిని ఇనుమ‌డింప‌జేస్తాను అని మాట ఇస్తున్నానని సీజేఐ చెప్పారు. నేను ఇక్క‌డే పుట్టి పెరిగాను అని, తాను సామ‌న్యుడినే అని.. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల‌లో అనేక మందిని క‌లిసిన‌ట్టు గుర్తు చేసారు.
నాపై చాలా మంది ప్రేమాభిమానాలు కురిపించార‌ని, అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. హైకోర్టుకు వెళ్లే దారిలో సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌కు అమ‌రావ‌తి రైతులు స్వాగ‌తం ప‌లికారు. జాతీయ జెండాల‌తో ఎన్వీ ర‌మ‌ణ‌పై పూల వ‌ర్షం కురిపిస్తూ ఆహ్వానం ప‌లికారు. ఆహ్వానానికి.. అభిమానానికి ప్ర‌తీగా సీజేఐ కారులో నిల‌బ‌డి వారికి న‌మ‌స్కారం చేస్తూ.. ముందుకు సాగారు. గ‌తంలో 2015లో అమ‌రావ‌తి శంకుస్థాప‌న స‌మ‌యంలో ప్ర‌ధానితో పాటు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కూడా హాజ‌ర‌య్యారు.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: